Shubman Gill : నక్కతోక తొక్కిన శుభ్‌మన్ గిల్.. ఒక్క సిరీస్‌తోనే..
కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే గిల్ ఓ అద్భుతమైన రికార్డును అందుకున్నాడు.
టీమ్ఇండియా జింబాబ్వే పర్యటన విజయవంతంగా ముగిసింది. ఆదివారం హరారే వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లోనూ టీమ్ఇండియా 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా 5 మ్యాచుల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. టీ20 క్రికెట్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు వీడ్కోలు పలకడం, సీనియర్ ఆటగాళ్లు అయిన హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్‌లకు విశ్రాంతి ఇవ్వడంతో శుభ్‌మన్ గిల్ ఈ పర్యటనలో భారత జట్టుకు నాయకత్వం వహించాడు.
కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే గిల్ ఓ అద్భుతమైన రికార్డును అందుకున్నాడు. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో విదేశీ గడ్డపై నాలుగు మ్యాచుల్లో గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా గిల్ చరిత్ర సృష్టించాడు.
Yashasvi Jaiswal : జైస్వాల్ మామూలోడు కాదుగా.. కొడితే.. ప్రపంచ రికార్డు..
కాగా.. భారత టీ20 జట్టుకు గిల్ 14వ కెప్టెన్ కావడం విశేషం. మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ (50), మహేంద్ర సింగ్ ధోని (42), విరాట్ కోహ్లి (32), హార్దిక్ పాండ్యా (10), సూర్యకుమార్ యాదవ్ (5)ల తరువాత భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా గిల్ ఘనత సాధించాడు.
సిరీస్ విజయం సాధించిన తరువాత గిల్ మాట్లాడుతూ.. ఇదొక అద్భుతమైన సిరీస్ అని చెప్పాడు. తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన తరువాత కుర్రాళ్లు దెబ్బతిన పులిలా పంజా విసిరారు అని అన్నాడు. జట్టు ఆటతీరు పట్ల ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. టీమ్‌లోని చాలా మందికి విదేశాల్లో ఆడిన అనుభవం లేదన్నాడు. అయినప్పటికి వారు పరిస్థితులకు త్వరగానే అలవాటు పడి అద్భుతంగా ఆడారని, త్వరలో జరగనున్న శ్రీలంక పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.
Rohit Sharma : వన్డేల్లో, టెస్టుల్లో రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..
Shubman Gill and his father, mother and sister posing with the trophy. ❤️ pic.twitter.com/40tu9OnvZV
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2024