Kalki 2898AD OTT : ప్రభాస్ ‘కల్కి’.. ఓటీటీలోకి ఎప్పుడంటే..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898AD.
![Kalki 2898AD OTT : ప్రభాస్ ‘కల్కి’.. ఓటీటీలోకి ఎప్పుడంటే..? Kalki 2898AD OTT : ప్రభాస్ ‘కల్కి’.. ఓటీటీలోకి ఎప్పుడంటే..?](https://10tv.in/wp-content/uploads/2024/07/Prabhas-Kalki-2898AD-ott-release-date.jpg)
Prabhas Kalki 2898AD ott release date
Kalki 2898AD : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898AD. జూన్ 27న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుని థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పటికే ఈ మూవీ 1000 కోట్ల క్లబ్లో చేరింది.
కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, అన్నా బెన్, శోభనలు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఇంకా థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది.
Also Read: Peka Medalu : 50 రూపాయలకే సినిమా చూడొచ్చు.. అది కూడా రిలీజ్‌కి ముందే..
కాగా.. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. వారు మరికొంతకాలం పాటు ఎదురుచూడాల్సి ఉంటుంది. థియేటర్లలో విడులైన 10 వారాల తరువాతే ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. అంటే సినిమా విడుదలైన రెండున్నర నెలల తరువాత మాత్రమే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ లెక్కన సెప్టెంబర్ 2వ వారంలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ రానుంది. కల్కి మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినీ దత్ తన కుమార్తెలు స్వప్న, ప్రియాంకలతో కలిసి ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.