కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ

గత పర్యటనలో ప్రధాని మోదీ, 10 మంది కేంద్రమంత్రులను కలిశారు. కీలక అంశాలపై చర్చించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ

Cm Chandrababu : కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సుమారు గంటపాటు వీరి సమావేశం సాగింది. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో అమిత్ షా తో చంద్రబాబు భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. విభజన సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై అమిత్ షాతో చర్చించారు చంద్రబాబు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి రంగాల వారిగా కేటాయింపులు పెంచాలని అమిత్ షా ను కోరారు చంద్రబాబు. వచ్చే ఐదేళ్లలో ఏపీకి లక్ష కోట్లకు పైగా నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నారు చంద్రబాబు.

10 రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు చంద్రబాబు. గత పర్యటనలో ప్రధాని మోదీ, 10 మంది కేంద్రమంత్రులను కలిశారు. కీలక అంశాలపై చర్చించారు. ఏపీలో అభివృద్ధి పనులకు, ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కేంద్ర పెద్దలను కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రేపు(జూలై 17) కూడా పలువురు కేంద్ర పెద్దలతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఏపీ సీఎం చంద్రబాబు 10 రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ భేటీలో ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న కేంద్ర బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాని మోదీ, 10మంది కేంద్ర మంత్రులను కలిసి రంగాల వారిగా జరగాల్సిన కేటాయింపులు, ఏపీ పునర్ నిర్మాణానికి కేంద్రం సహకారంతో పాటుగా పోలవరం, రాజధాని నిర్మాణం, రోడ్లు హైవేలు, పట్టణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, అర్బన్ డెవలప్ మెంట్.. ఈ విధంగా కీలక శాఖలకు సంబంధించిన అంశాలను చంద్రబాబు 10 రోజుల క్రితమే కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా మరోసారి ఢిల్లీ బాట పట్టారు చంద్రబాబు.

ఎన్డీయేలో కీలక పక్షాలుగా ఉన్న టీడీపీ, జేడీయూలకు కేంద్ర బడ్జెట్ లో ప్రత్యేక అలోకేషన్స్ ఉండాలని కోరుతున్నారు. ప్రత్యేక హోదా ఎలాగూ లేదంటున్నారు కనుక ప్యాకేజీలో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలకు నిధులు కేటాయించాలని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీయూ.. కేంద్రాన్ని కోరుతున్నాయి. వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలకు పైగా (ఏడాదికి 20వేల కోట్లు) నిధులతో పాటు ప్రత్యేక ఆర్థిక సాయాన్ని కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అందించాలని టీడీపీ కోరుతోంది. అమరావతి, పోలవరం నిర్మాణం.. మెడికల్ కాలేజీలు, ఎయిర్ పోర్టులు, పోర్టులు, మెట్రో నిర్మాణాలకు, రోడ్లు హైవేల నిర్మాణానికి.. ఇలా ప్రతి రంగానికి సంబంధించి కేటాయింపులు భారీగా ఉండాలని కోరుతున్నారు చంద్రబాబు.

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే భాగస్వామ్య పక్ష రాష్ట్రాలకు ప్రాధాన్యత అధికంగా ఉండాలని చంద్రబాబు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రంగాల వారిగా జరపాల్సిన కేటాయింపులకు సంబంధించి బీహార్ సీఎం నితీశ్ కుమార్ బడ్జెట్ లో 30వేల కోట్లు అడుగుతున్నారు. ఏపీకి సంబంధించి అదే స్థాయిలో కేటాయింపులు జరపాలని సీఎం చంద్రబాబు సైతం కేంద్ర పెద్దలను కోరుతున్నారు.

Also Read : అధికారంలో లేకపోయినా బిజీబిజీగా వైసీపీ కీలక నేతలు, జగన్ అత్యంత సన్నిహితులు..! ఎందుకో తెలుసా