ఏపీకి రండి, వ్యాపారాలు చేసుకోండి- నాస్కామ్‌కు మంత్రి నారా లోకేశ్ ఆహ్వానం

విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందన్నారు లోకేశ్. నాస్కామ్ తమ వ్యాపారాలను ఏపీకి బదిలీ చేసుకోవచ్చని సూచించారు.

ఏపీకి రండి, వ్యాపారాలు చేసుకోండి- నాస్కామ్‌కు మంత్రి నారా లోకేశ్ ఆహ్వానం

Nara Lokesh : కర్నాటక ప్రభుత్వం పరిశ్రమల బిల్లుపై నాస్కామ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ.. ఏపీ మంత్రి నారా లోకేశ్ నాస్కామ్ కు ఆహ్వానం పలికారు. ఏపీలో ఐటీ విస్తరణకు అవకాశం ఉందంటూ ఆహ్వానించారు. నాస్కామ్ కు స్వాగతం పలికేందుకు ఏపీ సిద్ధం అంటూ చెప్పారు. నాస్కామ్ నిరాశను ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకుందని.. ఏపీలో ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ క్లస్టర్ వ్యాపారాలు విస్తరించుకోవచ్చని తెలిపారు.

విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందన్నారు లోకేశ్. నాస్కామ్ తమ వ్యాపారాలను ఏపీకి బదిలీ చేసుకోవచ్చని సూచించారు. ఏపీలో పెట్టుబడులకు అత్యుత్తమ సౌకర్యాలు, నిరంతర విద్యుత్, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. నాస్కామ్ ఐటీ సంస్థకు ప్రభుత్వం నుండి పరిమితులు లేని నైపుణ్యం కలిగిన ప్రతిభ అందిస్తామని తెలిపారు మంత్రి లోకేశ్.

ఏపీ ఐటీ రంగం పూర్వ వైభవం కోసం ఆ శాఖ మంత్రి నారా లోకేశ్ తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కర్నాటకలో ప్రస్తుతం ఉన్న సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలని తన ప్రయత్నాలు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ సేవలు అందించే కంపెనీల అసోషియేషన్ నాస్కామ్(నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్).. కర్నాటక ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమల బిల్లు పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉంది. కర్నాటకలో ప్రైవేట్ కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది.

ఈ చట్టంపై నాస్కామ్ మండిపడుతోంది. లోకల్ టాలెంట్ కు కొరత ఉందని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఐటీ కంపెనీలు మరో చోటుకు తరలించాల్సి వస్తుందని నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే ఆ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ పరిస్థితుల్లో మంత్రి నారా లోకేశ్ ఎంటర్ అయ్యారు. నాస్కామ్ కు తన ప్రతిపాదనను ఎక్స్ లో పంపారు లోకేశ్. ఏపీకి రావాలంటూ ఆయన ఆహ్వానం పలికారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజా ప్రభుత్వం వచ్చిందని, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని, అన్ని సౌకర్యాలు(విద్యుత్, నీరు, భూమి, లా అండ్ ఆర్డర్) ప్రభుత్వమే కల్పిస్తుందని నాస్కామ్ కు తెలిపారు మంత్రి లోకేశ్. అయితే, లోకేశ్ చేసిన ప్రతిపాదనకు నాస్కామ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Also Read : కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు ఏపీ సర్కార్ ప్లాన్.. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని..