సొంతూరికి చేరుకున్న గల్ఫ్ ఎడారి బాధితుడు.. నారా లోకేశ్‌కు థ్యాంక్స్ చెప్పిన శివ

నా బాధను చెప్పుకుంటూ తీసిన సెల్ఫీ వీడియో బాగా వైరల్ అయింది. మీడియా చానళ్లు కూడా బాగా కవర్ చేశాయి.

సొంతూరికి చేరుకున్న గల్ఫ్ ఎడారి బాధితుడు.. నారా లోకేశ్‌కు థ్యాంక్స్ చెప్పిన శివ

Andhra Pradesh man trapped in Kuwait rescued and return to home

Updated On : July 17, 2024 / 1:37 PM IST

Andhra Pradesh man in Kuwait : గల్ఫ్ ఎడారి బాధితుడు శివ ఎట్టకేలకు సొంతూరికి చేరుకున్నాడు. కువైట్ నుంచి బెంగళూరు విమానాశ్రయం చేరుకొని అటు నుంచి స్వగ్రామం చింతపర్తికి వచ్చి కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. అన్నమయ్య జిల్లాకు చెందిన శివ.. బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లి ఎడారిలో తీవ్ర కష్టలు అనుభవించాడు. తన బాధను చెప్పుకుంటూ అతడు తీసిన సెల్ఫీ వీడియోపై ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించడంతో అతడి కష్టాలు తీరాయి.

తాను స్వగ్రామానికి రావడానికి ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎంతో సహకరించారని 10 టీవీతో శివ చెప్పాడు. కుటుంబ పోషణ కోసమే కువైట్ వెళ్లాను. ఇంటి వద్ద పశువులు కాసే పని అని చెప్పి నన్ను ఎడారిలో వేశారు. 60 డిగ్రీల సెంటిగ్రేటుకు పైబడిన ఉష్ణోగ్రతలో ఎడారిలో గొర్రెలను కాస్తూ నరకయాతన అనుభవించాను. కనీసం తోడుగా ఒక మనిషి కూడా లేకుండా పోయారు. ఇక్కడ ఉండడం కంటే చనిపోవడం నయం అనుకున్నాను.

నా బాధను చెప్పుకుంటూ తీసిన సెల్ఫీ వీడియో బాగా వైరల్ అయింది. మీడియా చానళ్లు కూడా బాగా కవర్ చేశాయి. ఆ వీడియో మంత్రి నారా లోకేశ్ వరకు వెళ్లడంతో నేను బతికి బయటపడ్డాను. నేను స్వగ్రామానికి రావడానికి ఆయన ఎంతో సహకరించారు. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలని శివ అన్నాడు. కాగా, శివ క్షేమంగా ఇంటికి చేరడంతో అతడి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

Also Read : ముచ్చుమర్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్.. ఇద్దరు పోలీసు అధికారులపై వేటు