Prabhas : ప్రభాస్‌పై ఆ స్టార్‌ హీరోలకు ఈర్ష్య!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస విజయాలు కొందరికి కంటగింపుగా మారాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Prabhas : ప్రభాస్‌పై ఆ స్టార్‌ హీరోలకు ఈర్ష్య!

Star Heroes Jealous on Prabhas

పక్కోడిని చూసి ఏడ్వడమే ఈగో.. మనకు లేనిది వారి వద్ద ఉందంటే సహించలేకపోవడమే ఈగో.. చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పేవారు సైతం ఈగోతోనే బ్రతుకుతుంటారు.. ఓ విధంగా ఈ ఈగో లేని వారు ఎవరైనా ఉంటారా? అంటే చెప్పడం కష్టమే. ఇందుకు మన టాలీవుడ్‌ హీరోలు కూడా అతీతులేం కాదని ఇండస్ట్రీ టాక్‌. ఇప్పుడు టాలీవుడ్‌ హీరోల ఈగోపైనే విస్తృత చర్చ జరుగుతోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస విజయాలు కొందరికి కంటగింపుగా మారాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌.. ఇప్పుడు పాన్‌ వరల్డ్‌ స్టార్‌గా మారడాన్ని కొద్ది మంది యంగ్‌ హీరోలు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ప్రభాస్‌ సినిమాలు, కలెక్షన్లు, ప్రభాస్‌తో సినిమాలు చేయడానికి నిర్మాతలు పోటీపడటాన్ని కొందరు అస్సలు డైజెస్ట్‌ చేసుకోలేకపోతున్నారని ఇటీవల విస్తృత ప్రచారం జరుగుతోంది. కల్కి మూవీ సూపర్‌ హిట్‌కావడంతో ఈ చర్చ మరింత ఎక్కువైందట.

R Narayana Murthy : అభిమానుల్లారా ఆందోళన వద్దు.. ఆరోగ్యంగానే ఉన్నా : ఆర్ నారాయణమూర్తి

హిట్.. ప్లాప్ అన్న తేడా లేకుండా ప్రభాస్ జర్నీ సూపర్ ఫాస్ట్‌గా సాగిపోతుండటం, నాన్ స్టాప్ సినిమాలు చేస్తుండటంతో కొందరు స్టార్ హీరోలు తెగ ఫీల్ అవుతున్నారంటున్నారు. గతంలో ప్రభాస్ సినిమాలు రాధేశ్యామ్, ఆది పురుష్ ప్లాప్ అవ్వగా, సదరు కథానాయకులు గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసుకున్నారని చెబుతున్నారు. కల్కి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటం, వెయ్యి కోట్లు బిజినెస్‌ దాటిపోవడం కొంతమంది తట్టుకోలేకపోతున్నారంటూ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

కల్కి సక్సెస్‌ క్రెడిట్ ప్రభాస్ ఒక్కడిది కాదని, ఆ సినిమా డైరెక్టర్, బాలీవుడ్ స్టార్ అమితాబ్, దీపికా పదుకునే, కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ వంటి పేరున్న నటీనటులు ఉండటమే అంతలా ఆడుతోందని తమ సహచరులతో చెబుతూ ఆత్మ సంతృప్తి పొందుతున్నారంటున్నారు. బయట ఒకటి, మనసులో మరోకటి పెట్టుకుని నటిస్తున్న సదరు కథానాయకుల వ్యవహారం ప్రభాస్ దృష్టికి వెళ్లినా లైట్‌గా తీసుకున్నాడని చెబుతున్నారు. ది రాజా సాబ్ తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా స్టార్ట్ చెయ్యబోతున్నాడు. దీని వసూళ్ల టార్గెట్ 1500 కోట్ల పైనే పెట్టుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి ప్రభాస్‌ కలెక్షన్ల రికార్డు టాలీవుడ్‌ను ఊపేస్తుండగా, అంత సక్సెస్‌ సాధించలేకపోయాని కొద్దిమంది ఈగోకు పోతుండటం చర్చనీయాంశంగా మారింది.

Sardar 2 : ‘స‌ర్దార్ 2’ సెట్‌లో ప్ర‌మాదం.. ఒక‌రి మృతి..