Nani – Chiranjeevi : నాని వాయిస్‌తో.. మెగాస్టార్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా గొప్పతనం విన్నారా..?
చిరంజీవి కెరీర్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి ఒకటని మనకు తెలిసిందే.
Jagadeka Veerudu Athiloka Sundari – Nani : మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి ఒకటని మనకు తెలిసిందే. చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు అమ్రిష్ పురి విలన్ గా పలువురు చైల్డ్ ఆర్టిస్టులు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. 1990ల్లోనే దాదాపు రెండు కోట్ల బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.
అయితే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా 1990 మే 9న రిలీజయింది. ప్రమోషన్స్ కూడా బాగానే చేసారు. కానీ ఆ సమయానికి తుఫాను వచ్చి మే 6 నుంచి ఊర్లు ఊర్లు కూడా నీళ్ళల్లో మునిగిపోయి కష్టాల్లో ఉన్నా భయపడుతూ కష్టపడి సినిమా రిలీజ్ చేసారు. అంతటి క్లిష్ట సమయాల్లో కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా పెద్ద హిట్ కొట్టి అప్పట్లోనే 15 కోట్ల కలెక్షన్స్ సాధించి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అసలు అప్పుడు ఉన్న పరిస్థితులకు ఆ సినిమా రిలీజయి పెద్ద హిట్ అవ్వడం ఒక అద్భుతం.
Also Read : Janhvi Kapoor : వాట్.. జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ మరీ అంత ఎక్కువా..? టాలీవుడ్లో అంత ఇస్తారా?
అయితే ఈ సినిమా రిలీజయి ఇప్పటికి 34 ఏళ్ళు దాటేసింది. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా గతంలో 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సమయంలో నాని వాయిస్ తో ఈ సినిమా గొప్పదనం గురించి చెప్తూ, ఈ సినిమా రిలీజ్ అప్పుడు వచ్చిన కష్టాల గురించి చెప్తూ, అశ్వినీదత్, రాఘవేంద్రరావు ఫేస్ చేసిన పరిస్థితుల గురించి చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు. అందులో నాని వాయిస్ కి అప్పటి ఫోటోలు, పోస్టర్స్ జత చేసి వీడియో చేసారు. అప్పట్లో ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఈ వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ గా మారగా చిరంజీవి సినిమా గురించి నాని ఇంత బాగా వాయిస్ ఇవ్వడంతో ఆ వీడియో మరింత ఇంట్రెస్ట్ గా మారింది. మీరు కూడా ఒకసారి నాని వాయిస్ తో మెగాస్టార్ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా గొప్పదనం వినేయండి..
తెలుగు సిని చరిత్రలో ఒక తూఫాన్…!!
Natural Star #Nani's shares trivia about the INDUSTRY BLOCKBUSTER, #JVAS.#Chiranjeevi #AshwiniDutt#JagadekaVeeruduAthilokaSundari pic.twitter.com/8PFIcahKSg
— Gulte (@GulteOfficial) July 17, 2024