రత్నభాండాగారం మూడో గదిని తెరిచిన అధికారులు

విలువైన సంపదనును భద్రపరిచిన తరువాత రత్న భాండాగారం గదిని పూరీ కలెక్టర్ ఆధ్వర్యంలో ఏఎస్ఐకి..

రత్నభాండాగారం మూడో గదిని తెరిచిన అధికారులు

ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారం మూడో గదిని తెరుస్తున్నారు. శ్రీ క్షేత్రం పూరీ జగన్నాథ్.. ముఖ ద్వారానికి సాష్టాంగ నమస్కారం చేసి లోనికి వెళ్లారు జస్టిస్ విశ్వనాద్ రథ్, జగన్నాథ్ ట్రస్ట్ ఏవో అరవింద్ పాడీ, జిల్లా కలెక్టర్.

దాన్ని తెరవాలని ఇప్పటికే పూరీలోని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయం తీసుకున్న విషయం తెలసిిందే. నేటి ఉదయం 9.51 నుంచి 12.15 గంటల మధ్య తెరవాలని జగన్నాథ్ ట్రస్ట్ ఆలయ పండితులు ముహూర్తం ఫిక్స్ చేశారు.

పాత ఆభరణాలు, విలువైన వస్తువులు ఖటషేజా గదికి తాత్కాలికంగా తరలించారు. విలువైన సంపదనును భద్రపరిచిన తరువాత రత్న భాండాగారం గదిని పూరీ కలెక్టర్ ఆధ్వర్యంలో ఏఎస్ఐకి అప్పజెప్పారు. రత్న భాండాగార మూడవ గది పరిశరాలపై ఇప్పటికే ఆర్కియాలజీ కల్ సర్వే ఆప్ ఇండియా నిపుణులు అధ్యయనం చేశారు.

రత్న భాండాగారం నిర్మాణం శిథిలావస్థలో ఉందని వారు చెప్పారు. గోడల నుంచి నీళ్లు కారడం, కొన్ని రాళ్లు కదలడం వంటివి చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. జగన్నాథ ఆలయ ట్రస్ట్, ఉన్నత-స్థాయి తనిఖీ కమిటీ, ఒడి సర్కారుతో చర్చల అనంతరం మరమ్మతు పనుల కోసం ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్ సిద్ధం చేయనుంది.