Global IT Outage: మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయంపై ఆనంద్ మహీంద్ర ఫన్నీ ట్వీట్ వైరల్

వాణిజ్య, వ్యాపారాలు మందగమనంతో ముందుకు సాగుతున్నాయి. బ్యాంకింగ్ సేవలపై..

Global IT Outage: మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయంపై ఆనంద్ మహీంద్ర ఫన్నీ ట్వీట్ వైరల్

మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయంపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇప్పుడు ప్రపంచ వాణిజ్య కార్యకలాపాల గమనం ఈ విధంగా ఉందంటూ ఆయన రెండు ఎద్దులు ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. వాటిపై ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్నట్లు ఉంది.

ఆనంద్ మహీంద్ర చేసిన ఈ ఫన్నీ పోస్ట్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వీస్ కు అంతరాయంతో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఎద్దులను స్టాక్ మార్కెట్ కు సూచకంగా వాడతారు.

వాణిజ్య, వ్యాపారాలు మందగమనంతో ముందుకు సాగుతున్నాయి. బ్యాంకింగ్ సేవలపై కూడా దీని ప్రభావం పడింది. మళ్లీ మనం పాత రోజులకు వెళ్తే బాగుంటుందని కొందరు నెటిజన్లు ఆనంద్ మహీంద్ర పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు. ‘అద్భుతమైన పెట్రోలింగ్ వాహనం’ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. అన్ని కంపెనీలు మైక్రోసాఫ్ట్ టెక్నాలజీపై బాగా ఆధారపడుతున్నాయి. దానికి ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసుకోలేదు. దీంతో సమస్యలు తప్పట్లేదు.

సమస్యను పరిష్కరించేందుకు మైక్రోసాఫ్ట్ కృషి చేస్తోంది. ఈ సమస్య పూర్తిగా ఎప్పుడు తొలగిపోతుందో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.