పట్టాలు తప్పిన చండీగఢ్- దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

చండీగఢ్- దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం ప్రమాదానికి గురైంది.

పట్టాలు తప్పిన చండీగఢ్- దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

Chandigarh Dibrugarh Express Train Derails In UP Gonda

Updated On : July 18, 2024 / 7:25 PM IST

Chandigarh Dibrugarh Express Derails: చండీగఢ్- దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు (15904) గురువారం ప్రమాదానికి గురైంది. ఉత్తరప్రదేశ్ లోని గోండా సమీపంలో పట్టాలు తప్పింది. గోండా, జిలాహి మధ్య ఉన్న పికౌరా ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం ధాటికి 12 బోగీలు పట్టాలు తప్పాయి. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారు. గాయపడిన వారికి వెంటనే వైద్యసహాయం అందించాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకి రైల్వే శాఖ ఆదేశించింది.

ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, 60 మంది వరకు గాయపడినట్టు సమాచారం. పట్టాలు తప్పిన బోగీల నుంచి ప్రయాణికులను కాపాడేందుకు స్థానికుల సహాయంతో అధికారులు ప్రయత్నిస్తున్నారు. 15 అంబులెన్స్‌లతో 40 మంది సభ్యుల వైద్య బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ప్రమాదంపై స్పందించారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రయాణికుల సహాయార్థం రైల్వేశాఖ హెల్స్ లైన్ నంబర్లను ప్రకటించింది.