బాబాయ్‌ని ఎవరు చంపారో త్వరలో తెలుస్తుంది: చంద్రబాబు సంచలన కామెంట్స్

కోడికత్తి డ్రామా మాత్రమే ఫలించిందని, గులకరాయి నాటకం పండలేదని..

బాబాయ్‌ని ఎవరు చంపారో త్వరలో తెలుస్తుంది: చంద్రబాబు సంచలన కామెంట్స్

బాబాయ్‌ని ఎవరు చంపారో త్వరలో తెలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ.. నేరస్తుడే సీఎం పదవిని చేపడితే, పోలీసులు నేరస్తులకు సహకరిస్తే ఎలా ఉంటుందో గత ఐదేళ్లల్లో చూశామని చెప్పారు.

అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్లిన సీబీఐ ఖాళీ చేతులతో తిరిగి వచ్చిందని అన్నారు. మొదట కోడికత్తి, ఆ తర్వాత గులకరాయి డ్రామాలు ఆడారని తెలిపారు. అయితే, కోడికత్తి డ్రామా మాత్రమే ఫలించిందని, గులకరాయి నాటకం పండలేదని ఎద్దేవా చేశారు. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించారని తెలిపారు.

రుషికొండ ప్యాలెసును ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదని చెప్పారు. ఎమ్మెల్యేలంతా ఓసారి రుషికొండ ప్యాలెస్ సందర్శించాల్సి ఉంటుందని తెలిపారు. బాత్రూంలు కూడా లక్షలు వెచ్చించి నిర్మించారని చెప్పారు. కొందరు టూరిజానికి ఇమ్మంటున్నారని, ఏం చేయాలో ఆలోచిస్తామని తెలిపారు. ఏపీలోని మద్యం కుంభకోణం ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం నథింగ్ అని ఆరోపించారు. త్వరలోనే మద్యం కుంభకోణం విషయాన్నీ మాట్లాడతానని చెప్పారు.

విష్ణుకుమార్ రాజు కల్పించుకుని..
బాబాయ్‌ని ఎవరు చంపారన్న అంశంపై చంద్రబాబు స్పీచ్ మధ్యలో విష్ణుకుమార్ రాజు కల్పించుకుని మధ్యలో మాట్లాడారు. ఐదేళ్ల పాటు విధ్వంసకర పాలన చూశామని తెలిపారు. ఇంతటి విధ్వంసకర పాలన చూసిన తర్వాత కూడా 40 శాతం ఓట్లెలా వచ్చాయోనని అన్నారు. వివేకా హత్య విషయంలో సీబీఐ విచారణలో వాస్తవాలు తేలుతాయని విష్ణు కుమార్ రాజు అన్నారు. కేంద్రమే తేల్చాలని టీడీపీ సభ్యులు చెప్పారు.

Also Read: స్మితా సబర్వాల్ ట్వీట్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు