అధికారంలోకి వచ్చిన నాటినుంచి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తెలుసా? అప్పులు ఎన్నంటే..

గత ప్రభుత్వ నిర్వాకం వల్ల చివరికి అప్పులు కట్టడానికి అప్పులు తీసుకునే పరిస్థితికి రాష్ట్రం దిగజారిందని భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.

అధికారంలోకి వచ్చిన నాటినుంచి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తెలుసా? అప్పులు ఎన్నంటే..

Bhatti Vikramarka

Telangana Budget 2024 Bhatti Vikramarka : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి దశాబ్దకాలంలో ఆశించిన స్థాయిలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి అడుగంటింది. రాష్ట్రం అప్పుల పాలైందని బీఆర్ఎస్ పాలనపై భట్టి విమర్శలు గుప్పించారు. రాష్ట్రం ఆవిర్భవించిన సమయానికి రాష్ట్రం అప్పులు 75,577 కోట్లు. గత ఏడాది డిసెంబర్ నాటికి అవి రూ. 6,71,757 కోట్లకు చేరాయని భట్టి తెలిపారు. పదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు పదిరెట్లు పెరిగిందని చెప్పారు.

Also Read : Telangana Budget 2024 : తెలంగాణ బడ్జెట్ లో ఏఏ రంగానికి ఎంత కేటాయించారంటే?

డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే నాటికి రాష్ట్రంలో అప్పులు రూ.6,71,757 కోట్లు ఉన్నాయని పేర్కొన్న భట్టి.. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చేందుకు శ్రీకారం చుట్టామని అన్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 35,118 కోట్ల రూపాయలు రుణాలు తీసుకోగా.. గత ప్రభుత్వం చేసిన రుణాలలో అసలు, వడ్డీలతో కలిపి 42,892 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించామని భట్టి విక్రమార్క తెలిపారు. అంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రుణాల కన్నా 7,774 కోట్ల రూపాయలు ఎక్కువగా రుణాలు ఈ కొద్ది నెలల్లోనే చెల్లించడం జరిగిందని చెప్పారు.

Also Read : మ‌ల‌క్‌పేట‌ అంధ బాలికల వసతి గృహంలో అమానుషం.. మంత్రి సీతక్క సీరియస్

గత ప్రభుత్వ నిర్వాకం వల్ల చివరికి అప్పులు కట్టడానికి అప్పులు తీసుకునే పరిస్థితికి రాష్ట్రం దిగజారిందని భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా.. సంక్షేమాన్ని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించలేదని చెప్పారు. డిసెంబర్ నుంచి నేటి వరకు రూ. 34,579 కోట్లు వివిధ పథకాలపై ఖర్చు చేశామని, ఈ పథకాలలో ముఖ్యమైనవి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా, బియ్యం పై సబ్సిడీ ఉన్నాయని అన్నారు. సంక్షేమంతో పాటు మూలధన వ్యయానికి కూడా అదనంగా 19,456 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని భట్టి తెలిపారు.