Committee Kurrollu Trailer : నిహారిక నిర్మాతగా.. ‘కమిటీ కుర్రోళ్ళు’ ట్రైల‌ర్ వచ్చేసింది..

మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం కమిటీ కుర్రోళ్ళు.

Committee Kurrollu Trailer : నిహారిక నిర్మాతగా.. ‘కమిటీ కుర్రోళ్ళు’ ట్రైల‌ర్ వచ్చేసింది..

Committee Kurrollu Trailer out now

Committee Kurrollu : మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం కమిటీ కుర్రోళ్ళు. య‌దు వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ద్వారా ఏకంగా 20 మందికి పైగా కొత్త వాళ్ల‌ను ప‌రిచ‌యం చేస్తున్నారు.

సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్ త్రినాథ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, పాట‌లు ఈ చిత్రంపై మంచి బ‌జ్‌ను క్రియేట్ చేశాయి.ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 9న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

Rajinikanth : ఇది ఏ తాత చేయని ప్రపంచ రికార్డు! మనవడిని స్కూల్లో డ్రాప్ చేసిన సూప‌ర్ స్టార్‌.. పిక్స్ వైర‌ల్‌

ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. ట్రైల‌ర్ చూస్తుంటే గోదావరి జిలాల్లోని ఓ ఊర్లో ఉండే 90s కిడ్స్ ఫ్రెండ్స్ కథలా అనిపిస్తోంది. మొత్తంగా ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది.