Next US President : బైడెన్ విషయంలో జోస్యం నిజమైంది.. అమెరికా కొత్త అధ్యక్షుడు ఎవరో ముందే చెప్పిన ఆస్ట్రాలజర్..!

Next US President : అమెరికాలో ప్రముఖ ఆస్ట్రాలజర్‌గా పేరొందిన అమీ ట్రిప్ చెప్పిందే నిజమైంది. బైడెన్ ఎన్నికల నుంచి తప్పుకుంటారని ఆమె ముందుగానే అంచనా వేయగా అది అక్షరాలా నిజమైంది.

Next US President : బైడెన్ విషయంలో జోస్యం నిజమైంది.. అమెరికా కొత్త అధ్యక్షుడు ఎవరో ముందే చెప్పిన ఆస్ట్రాలజర్..!

Astrologer Who Correctly Predicted Biden Exit Reveals Name Of Next US President ( Image Source : Google )

Next US President : అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి జో బైడెన్ తప్పుకున్నారు. ఈ విషయంలో అమెరికాలో ప్రముఖ ఆస్ట్రాలజర్‌గా పేరొందిన అమీ ట్రిప్ చెప్పిందే నిజమైంది. బైడెన్ ఎన్నికల నుంచి తప్పుకుంటారని ఆమె ముందుగానే అంచనా వేయగా అది అక్షరాలా నిజమైంది.

అయితే, ఇప్పుడు, అమెరికా కొత్త అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు అనేది కూడా ఆమె రివీల్ చేశారు. జో బైడెన్ గురించి ఆమె చెప్పిన జోస్యం నిజం కావడంతో యూఎస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఫుల్ ఫేమస్ అయ్యారు. న్యూయార్క్ పోస్ట్‌లోని నివేదిక ప్రకారం.. నక్షత్రాలను బట్టి పరిశీలిస్తే.. తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కావచ్చునని ఆమె జోస్యం చెప్పారు.

Read Also :  Donald Trump Video : బుల్లెట్ దూసుకువస్తుండగా.. పక్కకు తల తిప్పిన ట్రంప్.. వీడియో వైరల్!

ట్రంప్‌కు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్ హయాంలో మరిన్ని విచిత్ర సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఈ నెలలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. అదృష్టవశాత్తూ రెప్పపాటులో పెనుప్రమాదం తప్పిందని అమీ ట్రిప్ తెలిపారు. యురేనస్ తన మిడ్ హెవెన్‌లో ఉన్నాడని, ట్రంప్ కెరీర్‌తో పాటు తన లక్ష్యాలతో అనుకూలతను చూపుతుందని ఆమె అంచనా వేసింది.

పౌర్ణమి రోజునే బైడెన్ నిష్ర్కమణ :
81 ఏళ్ల బైడెన్ అధ్యక్ష ఎన్నికల నుంచి ఎప్పుడు వైదొలుగుతారో కచ్చితంగా అంచనా వేసినందుకు 40 ఏళ్ల ఆస్ట్రాలజర్ వైరల్ అయ్యారు. బైడెన్ పదవీ విరమణ కాలం.. 29 డిగ్రీల మకరం వద్ద మకర పౌర్ణమి ఉంటుంది. మకరం ప్రభుత్వాన్ని, వృద్ధాప్యాన్ని సూచిస్తుంది. అక్కేడే 29 డిగ్రీలు ముగుస్తుంది” అని ఈ నెల 11న ఎక్స్ వేదికగా ఆమె పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు కచ్చితమైన తేదీ చెప్పగలరా? అని ప్రశ్నించగా ఆమె “జూలై 21” అని బదులిచ్చారు. ఆ సమయంలో పౌర్ణమి కావడంతో బైడెన్ నిష్క్రమణను ఆమె అంచనా వేశారు.

అధ్యక్ష రేసులో కమలా హారిస్..? :
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ పోటీ చేస్తారని అమి ట్రిప్ ముందే జోస్యం చెప్పారు. హారిస్‌కు రెండో శని రాకను సూచిస్తుందని, అందుకే ఉపాధ్యక్షుడు నామినేషన్ గెలుస్తారని తాను భావించినట్లు ఆమె అవుట్‌లెట్‌తో చెప్పారు. సమీప భవిష్యత్తులో బైడెన్ మరిన్ని కష్టాలను అనుభవించవచ్చని ఆమె తెలిపారు. “ప్లూటో సూర్యునిపై ఉన్నాడు. ఆయనకు ఆరోగ్యపరంగా సమస్యలు రావచ్చు లేదా ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందన్నారు.

అమెరికాలో ఆగస్టు నెలంతా కష్టంగా ఉండవచ్చని, మున్ముందు మరింత రాజకీయ అశాంతి ఉండవచ్చని ట్రిప్ అంచనా వేశారు. ముఖ్యంగా డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ ఆగస్టు 19న ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా, నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ పోటీదారుగా జో బైడెన్ తరపున అమెరికా వైస్ ప్రెసిడెంట్ అధ్యక్ష రేసులో కమలా హారిస్ బరిలోకి దించే అవకాశం ఉందని, డొనాల్డ్ ట్రంప్‌తో పోటీపడనున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి. హారిస్‌కు పార్టీ లోపల, శ్వేతజాతీయేతర ఓటర్లలో మద్దతు గణనీయంగా పెరిగింది.

Read Also : Kamala Harris : జూమ్‌లో కమలా హారిస్ రికార్డుల మోత.. ‘ఫండ్‌ రైజింగ్‌’లో భారీగా నిధుల వెల్లువ..!