Donald Trump: కమలా హారిస్‌ రేసులోకి రావడంతో ట్రంప్‌లో భయం.. అంతేకాదు..

ట్రంప్ వ్యవహార శైలిలో, ప్రచార తీరులో మార్పు వచ్చేసింది. దీనంతటికి ఎన్నికల..

Donald Trump: కమలా హారిస్‌ రేసులోకి రావడంతో ట్రంప్‌లో భయం.. అంతేకాదు..

అతనిలో అప్పటిలా ధీమా కనిపించడం లేదు. తానే గెలుస్తానన్న మాటా చెప్పడం లేదు. ప్రత్యర్థిపై మాత్రం ఒంటి కాలిపై లేస్తున్నారు. గెలిచా.. మళ్లీ అధ్యక్షుడ్ని అయ్యా.. ఇక తిరుగులేదనుకున్న.. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరఫు ప్రెసిడెంట్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లో కలవరం మొదలైంది. బైడెన్‌ తప్పుకుని కమలా హారిస్‌ పేరును ప్రకటించగానే.. తన గెలుపు మరింత ఈజీ అంటూ చెప్పుకొచ్చారు ట్రంప్‌.

రెండు మూడ్రోజుల్లోనే ఆ దూకుడు తగ్గింది. కమలా హారిస్‌ క్యాండిడేచర్‌కు డెమొక్రాట్ల మద్దతు.. గెలుపోటములపై సర్వేలు ఇస్తున్న రిపోర్టులతో ట్రంప్‌లో వణుకు కనిపిస్తోంది. వార్‌ వన్‌ సైడ్‌ అన్నట్లుగా 78శాతం గెలుపు అవకాశాలతో ఉన్న ట్రంప్‌కు.. మారిన పొలిటికల్ సినారియోతో సీన్‌ సితార అవుతోంది. దీంతో ఏం చేయాలో తెలియక.. ఏం అంశం ఎజెండాగా ఎన్నికల రేసును మార్చాలో ఎత్తులు వేస్తున్నారు.

జోబైడెన్ ప్రెసిడెంట్‌ రేసులో ఉన్నంత కాలం ట్రంప్‌ గెలుపు ఈజీ అని అమెరికన్లే కాదు.. ప్రపంచ దేశాల ప్రజలు కూడా భావించారు. ట్రంప్‌ కూడా వారం రోజుల క్రితం వరకు అదే ధీమాతో కనిపించారు. దానికి సానుభూతి తోడు అయింది. ప్రచారంలో ట్రంప్‌పై కాల్పులతో ఆయనకు ప్రజాదరణ మరింత పెరిగింది. తనమీద దాడి జరిగిన వెంటనే ట్రంప్‌ వ్యవహరించిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది.

కాల్పులతో ఒక్కసారిగా టెన్షన్‌ పడ్డ ట్రంప్‌ వెంటనే తేరుకుని పిడికిలి బిగించి ఫైట్.. ఫైట్ అంటూ స్లోగన్స్ ఇచ్చి అమెరికన్లను ఆకట్టుకోగలిగారు. సోషల్ మీడియాలో ఆయనే ట్రెండింగ్‌లో ఉంటూ వచ్చారు. ఆ తర్వాతే యూఎస్ రాజకీయాల్లో అసలు స్టోరీ మొదలైంది. జోబైడెన్ ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకుని కమలా హారిస్‌ పేరును ప్రకటించారు. అప్పుడు కూడా ట్రంప్‌లో ధీమా తగ్గలేదు. ఆ తర్వాత రోజులు గడిచినా కొద్దీ ట్రంప్ ఢీలా పడుతున్నారు.

సమరం ఇంకో టర్న్
బైడెన్ రేసులో ఉన్నప్పుడే.. కాల్పులు జరగడంతో సానుభూతే ఆయుధంగా వాడుకోవాలనుకున్నాడు ట్రంప్. కమలా హారిస్‌ రేసులోకి రావడంతో.. ఎన్నికల సమరం ఇంకో టర్న్ తీసుకుంటోంది. ఆమెకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ట్రంప్ గెలుపు అవకాశాలు భారీగా తగ్గిపోతున్నాయి. 78శాతంగా ఉన్న ట్రంప్ గెలుపు అంచనాలు 49 శాతానికి తగ్గాయి. ఇప్పటికీ ఒకటి రెండు శాతం ఓట్ల తేడాతో ట్రంపే ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. అతనికి కమలా హారిస్‌ గట్టి పోటీ ఇస్తున్నారనే విషయం మాత్రం స్పష్టం అవుతోంది.

వాల్ స్ట్రీట్ జర్నల్ లేటెస్ట్ సర్వేలో 49 పాయింట్లతో ట్రంప్‌, 47 పాయింట్లతో కమలా ఉన్నారు. ఇద్దరి మధ్య నెక్ టు నెక్ ఫైట్ ఉంది. న్యూయార్క్ టైమ్స్ పోల్‌లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ ఉంది. కమలాకు 47 శాతం ఓటర్ల మద్దతు, ట్రంప్‌కు 48 శాతం ఓటర్ల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. జులై మొదట్లో ఉన్న పబ్లిక్‌ పల్స్‌ను బట్టి చూస్తే అప్పటికి ఇప్పటికి డెమోక్రాట్లకు ఆదరణ పెరిగింది.

నెల క్రితం న్యూయార్క్ టైమ్స్ పోల్‌లో నల్లజాతి ఓటర్ల నుంచి బైడెన్‌కు 59 శాతం మంది మద్దతు ఉండగా.. ప్రస్తుతం కమలా హారిస్‌కు నల్లజాతి ఓటర్ల మద్దతు 69 శాతానికి పెరిగిందని అంచనా. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది. ఇప్పుడే కమలా హారిస్‌కు ఈరేంజ్‌లో మద్దతు ఉంటే.. ఎన్నికల పోలింగ్ నాటికి పరిస్థితి ఏంటన్నది ట్రంప్ ఆందోళన.

పర్సనల్ అటాకింగ్
అందుకే కమలా హారిస్‌పై పర్సనల్ అటాకింగ్ మొదలుపెట్టారు ట్రంప్. అమెరికాను పాలించే అర్హత కమలాకు లేదని.. ఆమె యూదులకు వ్యతిరేకమని క్యాంపెయిన్ చేస్తున్నారు. అంతేకాదు కమలాకు పిల్లలు లేరని కామెంట్ చేశారు రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీవాన్స్. ఇది కాస్త బూమరాంగ్ అయింది. ఇక కులాలు, మతాల చిచ్చుతో ఓట్లు రాబట్టే ప్రయత్నం స్టార్ట్‌ చేశారు. సామాజిక వర్గాల వారీగా ఓటర్లలో చీలిక తెచ్చేందుకు కుట్రలు చేస్తున్నారు.

క్రిస్టియన్ మీటింగ్‌లో ట్రంప్ చేసిన కామెంట్స్ చర్చనీయాశంగా మారాయి. క్రైస్తవ సోదరులరా.. ఇప్పుడు ఓటేయకుంటే ఇకపై వేయాల్సిన అవసరం లేదు.. ఓ క్రిస్టియన్‌గా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.. మీరు బయటకు వచ్చి ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. ఇలా ట్రంప్ వ్యవహార శైలిలో, ప్రచార తీరులో మార్పు వచ్చేసింది. దీనంతటికి కారణం ఎన్నికల ప్రీపోల్ సర్వేలేనని.. కమలా హారిస్‌ తనకు గట్టిపోటీదారని భావించే ఇలా బిహేవ్ చేస్తున్నారని అంటున్నారు పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్‌.

Also Read: ఇప్పుడు బంగారం కొని పెట్టుకుంటే లాభమా? నష్టమా?