Gold Price Today : అదిరిపోయే శుభవార్త.. మరోసారి భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో మంళవారం బంగారం ధర తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ..

Gold Price Today : అదిరిపోయే శుభవార్త.. మరోసారి భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయో తెలుసా?

Gold And Silver Price Today

Gold and Silver Price Today : కేంద్ర బడ్జెట్ తరువాత బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. గత వారం రోజుల వరకు 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 75వేలకు చేరుకోగా.. ప్రస్తుతం రూ. 60వేల మార్క్ కు చేరుకుంది. మరో వారంరోజులు ఇదే పరిస్థితి ఉంటుందని.. రూ.50వేలకు బంగారం ధర చేరుకునే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వెండిధరసైతం భారీగా తగ్గుతుంది. గతం వారం రోజుల క్రితం కిలో వెండి రూ. లక్ష దాటగా.. ప్రస్తుతం రూ. 89వేలకు చేరింది. మరో వారంరోజుల్లో వెండిధరసైతం రూ.70వేల మార్క్ కు చేరే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవాళ ఉదయం నమోదైన ధరలను పరిశీలిస్తే.. బంగారంపై రూ. 200 తగ్గగా.. వెండి ధర రూ. 500 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశంలోని పలు ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయో ఓసారి చూద్దాం.

Gold

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో మంళవారం బంగారం ధర తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,200 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.68,950.

Gold

  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.63,350 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 69,100.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.63,200 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 68,950.
    చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,850 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 69,650 కు చేరింది.

Gold

  • వెండి ధర ఇలా ..
    దేశ వ్యాప్తంగా మంగళవారం వెండి ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
    తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 89,000.
    దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
    చెన్నైలో కిలో వెండి ధర రూ.89,000.
    కోల్ కతాలో కిలో వెండి ధర రూ. 84,500 వద్ద కొనసాగుతుంది.
    ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.84,500.
    బెంగళూరులో మాత్రం వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. 500 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 84,500 వద్ద కొనసాగుతుంది.

Gold

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.