Flipkart iPhone Days Sale : ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్లపై అదిరే డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర ఎంత తగ్గిందంటే?

Flipkart iPhone Days Sale : ఆపిల్ ఐఫోన్ ప్లస్ మోడల్‌ను కొంచెం తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ 14 ప్లస్ 56,999 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. అసలు రిటైల్ ధర రూ. 79,999 కన్నా తక్కువగా ఉంటుంది.

Flipkart iPhone Days Sale : ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్లపై అదిరే డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర ఎంత తగ్గిందంటే?

Flipkart iPhone Days Sale starts

Flipkart iPhone Days Sale : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ డేస్ సేల్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్ అనేక ఆపిల్ డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఐఫోన్ 15, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 13 మరిన్ని ఐఫోన్లు తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ సేల్ సమయంలో ఐఫోన్ 15 ప్రారంభ ధర ధర రూ. 79,900 నుంచి రూ. 68,999కి తగ్గింది.

Read Also : iPhone Call Recording : ఐఓఎస్ 18.1 అప్‌డేట్.. ఐఫోన్‌లో కాల్ రికార్డింగ్ ఫీచర్.. ఆ యూజర్లకు మాత్రమే..!

ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా ఐఫోన్ 15పై రూ.10,901 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై అదనంగా రూ. 2,500 డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్ 15 ప్లస్ కూడా సొంతం చేసుకోవచ్చు. స్టాండర్డ్ వెర్షన్‌తో సమానంగా ఉన్నప్పటికీ, పెద్ద స్క్రీన్, బ్యాటరీని పొందవచ్చు. ఐఫోన్ ప్లస్ వెర్షన్ రూ.74,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 15 ప్లస్ ధర రూ. 89,900కి లాంచ్ చేయగా, వినియోగదారులు 128జీబీ స్టోరేజ్ మోడల్ రూ. 14,901 డిస్కౌంట్ పొందవచ్చు.

ఆపిల్ ఐఫోన్ ప్లస్ మోడల్‌ను కొంచెం తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ 14 ప్లస్ 56,999 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. అసలు రిటైల్ ధర రూ. 79,999 కన్నా తక్కువగా ఉంటుంది. రూ. లక్ష కన్నా ఎక్కువ ఉండే ప్రో వెర్షన్ కొనుగోలు చేసే యూజర్లు తక్కువ ధరలో ఒకదాన్ని పొందవచ్చు. ఐఫోన్ డేస్ సేల్ సందర్భంగా ఐఫోన్ 15 ప్రో మోడల్ రూ. 1,24,990గా లిస్టు చేసింది.

ఈ ఐఫోన్ అసలు ధర రూ. 1,34,990 నుంచి తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ ప్రోపై భారీ తగ్గింపును అందిస్తోంది. దీనిపై ఎలాంటి నిబంధనలు లేదా షరతులు లేవు. పాత ఆపిల్ డివైజ్ కొనుగోలు చేయాలనుకుంటే.. ఐఫోన్ 12 లేదా ఐఫోన్ 13పై తగ్గింపు ఆఫర్‌లను పొందవచ్చు. ఐఫోన్ 13 రూ. 52,999, ఐఫోన్ 12 రూ.39,999కి కొనుగోలు చేయవచ్చు.

Read Also : WhatsApp New Feature : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగా డబుల్ ట్యాప్ చేయెచ్చు..!