తల్లికి వందనమా? మంగళమా? సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫైర్

ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సాకులు చూపుతున్నారని సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

తల్లికి వందనమా? మంగళమా? సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫైర్

Adimulapu Suresh : ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియ బోధనను మొదటి నుంచి టీడీపీ వ్యతిరేకిస్తోందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆరోపించారు. ఇప్పుడు కూడా అదే ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. టోఫెల్ శిక్షణను రద్దు చేయడం పేద విద్యార్థులకు అన్యాయం చేయడమే అని ఆయన అన్నారు. అమ్మఒడి పథకాన్ని అమ్మకు వందనం అని పేరు మార్చారు. స్కూల్ తెరిచి 2 నెలలు అవుతున్నా అమ్మకు వందనం గురించి మాట్లాడటం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సాకులు చూపుతున్నారని సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం పాఠశాలలను పటిష్ఠం చేస్తున్నారా? నిర్వీర్యం చేస్తున్నారా? కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఆదిమూలపు సురేశ్. ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడం దుర్మార్గం అన్న ఆయన.. ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేస్తే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

”ప్రజలు మిమ్మల్ని క్షమించరు. నాడు – నేడు కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇతర రాష్ట్రాల వారు ఏపీకి వచ్చి పరిశీలన చేశారు. అందరికీ ఉపయోగపడే విధంగా జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలను కుంటి సాకులతో ఆపేసే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ప్రభుత్వ స్కూళ్లు ఉండకూడదని విధంగా చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. తల్లికి వందనం అన్నారు, తల్లికి మంగళం పాడారు. స్కూళ్లు స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతోంది. ఇంతవరకు అమ్మకు వందనం గురించి ఉలుకు పలుకు లేదు. ఈ ఏడాది కాదు వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని అంటున్నారు” అని చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్.

Also Read : మాజీ మంత్రి బొత్స ఎవరికి ఎర్త్‌ పెట్టాలని భావిస్తున్నారు? వైసీపీ నేతల వెన్నులో వణుకుపుట్టించిన వ్యాఖ్యలు