NEET-UG 2024 : నీట్ యూజీ పేపర్ లీకేజీపై పూర్తిస్థాయి తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు..

నీట్ యూజీ పేపర్ లీకేజీపై పూర్తిస్థాయి తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. జూలై 23న నీట్ యూజీ పరీక్ష రద్దు, రీ టెస్ట్ నిర్వహణ ..

NEET-UG 2024 : నీట్ యూజీ పేపర్ లీకేజీపై పూర్తిస్థాయి తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు..

NEET-UG 2024 Supreme Court Hearing : నీట్ యూజీ పేపర్ లీకేజీపై పూర్తిస్థాయి తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. పేపర్ లీకేజీలో ఎలాంటి వ్యవస్థీకృత ఉల్లంఘన జరగలేదని, ప్రశ్నాపత్రాల లీకేజీ పాట్నా, హజారీబాగ్‌లకే పరిమితమైందని సుప్రీంకోర్టు వెల్లడించింది. మరోసారి పేపర్ లీకేజీ ఘటనలు జరగకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. పరీక్ష వ్యవస్థలో ఉన్న సైబర్ భద్రత, సెక్యూరిటీ లోపాలు, పరీక్షా కేంద్రాల సీసీటీవీ పర్యవేక్షణను మరింత విస్తృతం చేయడానికి సాంకేతిక పురోగతికోసం ఎస్ఓపీ రూపొందించడాన్నికూడా కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుందని తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది.

Also Read : NEET-UG 2024 : నీట్ యూజీ పరీక్ష రద్దు, అక్రమాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ..

విద్యార్థుల అభ్యున్నతికోసం పేపర్ లీకేజీలను సహించమన్న సుప్రీంకోర్టు.. పేపర్ లీకేజీ ఘటనలు, సమస్యలు పునరావృతం కాకుండా కేంద్రం ఈ ఏడాదిలోనే సరిదిద్దాలని స్పష్టం చేసింది. నీట్ వివాదానికి ప్రతిస్పందనగా కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ పరిధిని సుప్రీంకోర్టు విస్తరించింది. పరీక్ష భద్రత మాత్రమే కాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యొక్క పరిపాలనా ప్రక్రియల సమగ్ర సమీక్షకూడా కేంద్ర కమిటీ జరపాలని సుప్రీంకోర్టు సూచించింది. NEET-UG-2024 నిర్వహణలో ఎటువంటి వ్యవస్థాగత ఉల్లంఘన జరగలేదని, అందువల్ల, మళ్లీ పరీక్ష నిర్వహణ కోసం చేసిన అభ్యర్థన తిరస్కరించబడిందని సుప్రీంకోర్టు వివరణాత్మక తీర్పు వెలువరించింది.