Nikhat Zareen : పారిస్ ఒలింపిక్స్‌లో ఓట‌మి.. తెలంగాణ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ కీల‌క వ్యాఖ్య‌లు..

పారిస్ ఒలింపిక్స్‌లో ప‌త‌క‌మే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగింది తెలంగాణ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌.

Nikhat Zareen : పారిస్ ఒలింపిక్స్‌లో ఓట‌మి.. తెలంగాణ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ కీల‌క వ్యాఖ్య‌లు..

Nikhat Zareen On Her Paris Olympic Elimination

Nikhat Zareen : పారిస్ ఒలింపిక్స్‌లో ప‌త‌క‌మే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగింది తెలంగాణ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌. అయితే.. ఆమె ఆశ‌ల‌న్ని ప్రిక్వార్ట‌ర్స్‌తోనే ముగిశాయి. గురువారం 50 కేజీల విభాగం ప్రిక్వార్టర్స్‌లో నిఖత్‌ 0-5తో చైనా బాక్సర్, ఆసియా క్రీడల స్వర్ణ విజేత వు హు చేతిలో ఓడిపోయింది. ప్ర‌త్య‌ర్థి బ‌ల‌మైన బాక్స‌రే అయిన‌ప్ప‌టికి కూడా రెండు సార్లు ప్ర‌పంచ ఛాంపియ‌న్‌గా నిలిచిన నిఖ‌త్ ఇలా తేలిపోవ‌డం, బౌట్ ఇంత ఏక‌ప‌క్షంగా సాగుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ఓట‌మి అనంత‌రం నిఖ‌త్ క‌న్నీళ్లు పెట్టుకుంది.

ఈ ఓట‌మితో కొత్త పాఠాలు నేర్చుకున్నాన‌ని నిఖ‌త్ అంది. గ‌తంలో ఎప్పుడూ కూడా వుయుతో త‌ల‌ప‌డ‌లేదంది. ‘ఆమె చాలా వేగంగా క‌దిలింది. ఇంటికి వ‌చ్చాక నేను ఎక్క‌డెక్క‌డ పొర‌పాట్లు చేశానో ఓ సారి విశ్లేషించుకుంటాను. ఎంతో కష్టపడి ఇక్కడిదాకా వ‌చ్చాను. శారీరకంగా, మానసికంగా ఒలింపిక్స్‌కి సన్నద్దమయ్యాను. రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వస్తాను.’ అని నిఖత్‌ జరీన్ చెప్పింది.

IND vs PAK : అభిమానుల‌కు పండ‌గే.. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో మూడు సార్లు త‌ల‌ప‌డ‌నున్న భార‌త్‌, పాకిస్తాన్‌..!

ఓట‌మి అనంత‌రం నిఖ‌త్ మీడియాతో మాట్లాడుతూ.. ఓట‌మికి ముందు తాను ఎదుర్కొన్న శారీర‌క‌, మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను చెప్పుకొచ్చింది. 50 కిలోల విభాగంలో పోటీప‌డేందుకు బ‌రువు పెర‌గ‌కుండా ఉండేందుకు రెండు రోజుల పాటు తాను పూర్తిగా భోజ‌నం మానేసిన‌ట్లు చెప్పింది. అంతేకాద‌ట‌.. నీళ్లు కూడా చాలా త‌క్కువ‌గానే తాగిన‌ట్లు వెల్ల‌డించింది. ఖాళీ క‌డుపుతోనే శిక్ష‌ణ‌ను కొన‌సాగించిట‌న్లు తెలిపింది. దీంతో మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి స‌రిగ్గా నిద్ర‌కూడా పోలేక‌పోయానంది.

ఇక ఈ ఓటమి త‌న‌ను ఎక్కువ కాలం వెంటాడుతుందని అంది. ఒక‌వేళ తాను గెలిచి ఉండే తాను ప‌డిన క‌ష్టాన్ని ప్ర‌శంసించే వార‌ని, ఇప్పుడు ఇది ఓ సాకుగా మాత్రం చెప్ప‌డం లేదంది. అయిన‌ప్ప‌టికి త‌న శాయ‌శ‌క్తుల మ్యాచ్‌ను గెలిచేందుకు ప్ర‌య‌త్నించానంది.

PV Sindhu : ఒలింపిక్స్‌లో ఓట‌మి.. పీవీ సింధు కీల‌క వ్యాఖ్య‌లు..

‘ఒక్క‌దాన్నే కొన్ని రోజులు వెకేష‌న్‌కి వెళ్లాల‌ని అనుకుంటున్నాను. ఎప్ప‌డు అలా చేయ‌లేదు. కానీ ఇప్పుడు మాత్రం అది చాలా అవ‌స‌రం. అలాగే మా మేనల్లుడు, మేనకోడలితో సమయం గడుపుతాను. నేను చాలా కాలంగా అలా చేయలేదు. నేను బలంగా తిరిగి వస్తాను.’ అని 28 ఏళ్ల నిఖ‌త్ అంది.