వల్లభనేని వంశీ ఎక్కడ? ఆ కేసులో ప్రధాన అనుచరుడు అరెస్ట్

మూడు ప్రత్యేక బృందాలు ఎఫ్ఐఆర్ లో నమోదైన వ్యక్తుల కోసం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి.

వల్లభనేని వంశీ ఎక్కడ? ఆ కేసులో ప్రధాన అనుచరుడు అరెస్ట్

Vallabhaneni Vamsi : కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసుఫ్ పఠాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పఠాన్ ను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో యూసుఫ్ ది కీలక పాత్ర ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక ఇదే కేసులో వంశీ మరో అనుచరుడు రమేశ్ ను నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

గన్నవరంలో టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు. దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా.. ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైసీపీ మూకలు విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలున్నాయి.

అంతకుముందు వంశీ ప్రధాన అనుచరుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు. అతడు హైదరాబాద్ లో ఉన్నాడని తెలుసుకుని అక్కడ సెర్చింగ్ చేశారు. దాడి ఘటనలో అతడిదే కీలక పాత్ర అని తేల్చారు పోలీసులు.

టీడీపీ ఆఫీసుపై దాడి కేసును అటు పాలకులు, ఇటు పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దాడి వెనుక ఉన్న వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో 71వ నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు 18మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. మూడు ప్రత్యేక బృందాలు ఎఫ్ఐఆర్ లో నమోదైన వ్యక్తుల కోసం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి.

అటు హైదరాబాద్, ఇటు కర్నాటక, తమిళనాడు ప్రాంతాల్లో మూడు ప్రత్యేక బృందాలు దర్యాఫ్తు చేస్తున్నాయి. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ప్రధానంగా వల్లభనేని వంశీ పాత్ర ఎంత? వంశీ అనుచరులు ఎంతమంది ఉన్నారు? అనే దిశగా పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటివరకు 18మంది వంశీ అనుచరులను అరెస్ట్ చేసి వారందరిని కోర్టులో హాజరుపరిచారు. వారిలో కొందరికి కోర్టు రిమాండ్ విధించింది. ప్రధానంగా వంశీపైన పోలీసుల దృష్టి పడింది. వంశీ పాత్ర ఎంత? అనేది ఆరా తీస్తున్నారు.

ఎన్నికల తర్వాత నుంచి వంశీ గన్నవరంలో ఉండటం లేదు. తన పార్టీ కార్యాలయాన్ని కూడా ఖాళీ చేసేశారు. ఈ పరిస్థితుల్లో వంశీ కోసం కూడా పోలీసులు విచారిస్తున్నారు. వంశీ హైదరాబాద్ లో ఉన్నారనే సమాచారంతో పోలీసు ప్రత్యేక బృందాలు అక్కడా గాలించాయి. టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి ప్రమేయం ఉందన్న అనుమానం ఉన్న వ్యక్తులందరిపైన పోలీసులు పూర్తి స్థాయి నిఘా పెట్టారు.

Also Read : ఏకంగా 59 మంది డీఎస్పీలను పక్కన పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. నారా లోకేశ్ రెడ్‌బుక్‌ ఓపెన్ చేసేశారా?