Lorry Chapter-1 : లారి – చాప్టర్ 1 మూవీ రివ్యూ..

శ్రీకాంత్ రెడ్డి లారి చాప్టర్ 1 సినిమా పూర్తి కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్.

Lorry Chapter-1 : లారి – చాప్టర్ 1 మూవీ రివ్యూ..

Sreekanth Reddy Lorry Chapter-1 Movie Review and Rating

Lorry Chapter-1 Movie Review : యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి ఆసం హీరోగా తెరకెక్కిన సినిమా లారి చాప్టర్ 1. అయితే ఈ సినిమాకి శ్రీకాంత్ రెడ్డి హీరోగానే కాక డైరెక్టర్, నిర్మాత, ఎడిటర్, ఫైట్ మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్.. ఇలా ఇన్ని రోల్స్ కూడా తనే చేశాడు. ఈ సినిమాలో చంద్రశిఖ హీరోయిన్ గా నటించింది. కింగ్ మేకర్ పిక్చర్స్ బ్యానర్ పై ఆసం వెంకటలక్ష్మి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. లారి చాప్టర్ 1 సినిమా నేడు ఆగస్టు 2న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. రంగపట్నంలో హర్షవర్ధన్ ఆలియ‌స్ హంట‌ర్ (శ్రీకాంత్ రెడ్డి ఆసం) రౌడీగా ఉంటాడు. తన ఫ్యామిలీని పోషించడానికి గొడవలకు వెళ్తూ ఉంటాడు. ఓ సమయంలో జైలుకు కూడా వెళ్తాడు. ఆ తర్వాత ఓ అమ్మాయితో ప్రేమలో పడి తన లైఫ్ మార్చుకొని ఒక మాములు మెకానిక్ గా జీవితం గడపాలనుకుంటాడు. కానీ అదే సమయంలో మైనింగ్ అధిపతి ప్రతాప్ ముఖ్యమంత్రి అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. తన మైనింగ్ లో బయటపడిన యురేనియం‌ని అమ్మటానికి, ఆ యురేనియంని ముంబైకి డెలివరీ చేయడానికి లారి డ్రైవర్ గా హర్షవర్ధన్ ని ఎంచుకుంటాడు.

ఆల్రెడీ మారిన హర్షవర్ధన్ తన చెల్లి పెళ్లి కోసం, కుటుంబం, డబ్బుల కోసం ఈ పనికి భారీ డబ్బులు ఆఫర్ చేయడంతో ఒప్పుకుంటాడు. హర్షవర్ధన్ లారీలో యురేనియంని ముంబైకి తీసుకెళ్తుంటే చాలా మంది అడ్డుకుంటూ ఉంటారు. మరి ఆ అడ్డంకులన్నీ దాటుకొని లారిని హర్షవర్ధన్ ముంబైకి డెలివరీ చేశాడా? హర్షవర్ధన్ తండ్రి కథేంటి? హర్షవర్ధన్ ప్రేమ ఏమైంది? అతను ఎందుకు రౌడీ నుంచి మాములు మనిషిగా మారిపోయాడు తెలియాలంటే తెరపైచూడాల్సిందే.

Also Read : Devara : ఎన్టీఆర్ ‘దేవ‌ర’ నుంచి సూప‌ర్ అప్‌డేట్‌.. రొమాంటిక్ సాంగ్‌కు డేట్ ఫిక్స్‌..

సినిమా విశ్లేష‌ణ‌ : ఇన్నాళ్లు యూట్యూబర్ గా మెప్పించిన శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు హీరోగా, దర్శకుడిగా మారి మరిన్ని బాధ్యతలు కూడా తీసుకొని లారి చాప్టర్ 1 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కథ పరంగా హీరో ఒక ఇంపార్టెంట్ వస్తువుని తరలిస్తుంటే పలువురు అడ్డుకోవడం, ఆ అడ్డంకులను దాటుకొని హీరో ఎలా గమ్యం చేరుకున్నాడు అనే కథాంశంతో చాలా సినిమాలు రాగా ఇది కూడా ఆ కోవలోదే.

శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమాని పూర్తి కమర్షియల్ గా తెరకెక్కించాడు. మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకొని డైలాగ్స్, లవ్ సీన్స్, ఫైట్ సీన్స్ పెట్టుకున్నాడు. తండ్రి సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో వర్కౌట్ అయింది. యూట్యూబ్ నుంచి వచ్చి మల్టీ టాస్కింగ్ తో సినిమా పూర్తిచేసి రిలీజ్ చేసాడంటే ఈ విషయంలో శీకాంత్ రెడ్డి బాగానే కష్టపడ్డాడు అని చెప్పొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్ : శ్రీకాంత్ రెడ్డి ఆల్రెడీ యూట్యూబ్ లో తన నటనతో మెప్పించి ఇప్పుడు సినిమాలో కూడా మెప్పించాడు. హీరోయిన్ చంద్రశిఖ అందం ఆరబోసే వరకు పరిమితమైంది. రాకీ సింగ్, మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు : సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్ లో ఇంకాస్త నిడివి తగ్గిస్తే బాగుండు అనిపిస్తుంది. పాటలు ఓకే అనిపిస్తాయి. ఫైట్స్ మాత్రం బాగున్నాయి. యాక్షన్ సన్నివేశాలకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.

శ్రీకాంత్ రెడ్డి లారి చాప్టర్ 1 సినిమా పూర్తి కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.