శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులు, పర్యాటకులు

ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన పిల్లలు, వృద్ధులు, మహిళల బాధ వర్ణనాతీతం.

శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులు, పర్యాటకులు

Srisailam

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు, పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. దీంతో శ్రీశైలంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీశైలం-హైదరాబాద్ ఘాట్ రోడ్డులో వాహనాలు నత్తనడకన ముందుకు వెళ్తున్నాయి. రోడ్లపై ప్రజలు ఇబ్బందులు పడతున్నారు.

శని, అది, సోమ వారాలు ఉండడంతో భక్తులు, పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్డు స్వీచ్ యార్డు నుంచి కొన్ని కిలో మీటర్ల మేర ట్రాఫిక్ ఏర్పడింది. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడంతో డ్యామ్ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు.

ఘాట్ రోడ్డులోని పక్కకు వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు శ్రీశైలం పోలీసులు అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన పిల్లలు, వృద్ధులు, మహిళల బాధ వర్ణనాతీతం. దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

Also Read: కుటుంబ సభ్యులను కోల్పోయి అనాథగా మిగిలిన బాలికకు చంద్రబాబు రూ.10 లక్షల సాయం ప్రకటన