Hyderabad: గోల్కొండ ఇబ్రహీంబాగ్‌లో కారు బీభత్సం.. చిన్నారి మృతి, మరో ఇద్దరికి గాయాలు

గోల్కొండ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీకి చెందిన రమేశ్ ప్రైవేట్ ఉద్యోగి. తన కుమారుడు శౌర్య, భార్యను తీసుకొని ఇబ్రహీంబాగ్ నుంచి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు.

Hyderabad: గోల్కొండ ఇబ్రహీంబాగ్‌లో కారు బీభత్సం.. చిన్నారి మృతి, మరో ఇద్దరికి గాయాలు

Car Accident In Hyderabad

Updated On : August 3, 2024 / 1:46 PM IST

Car Accident In Hyderabad : హైదరాబాద్ పరిధిలోని గోల్కొడ ఇబ్రహీంబాగ్ లో కారు బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. రాంగ్ రూట్ లో వేగంగా దూసుకొచ్చిన కారు బైక్ ను ఢీకొట్టింది. బైక్ పై వెళ్తున్న చిన్నారి(7) మృతి చెందగా.. చిన్నారి తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. కారులోని వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న గోల్కొండ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కారు డ్రైవ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Aliens : గ్రహాంతరవాసికి గుడి కట్టిన వ్యక్తి.. ప్రతిరోజూ పూజలు.. అలా ఎందుకు చేస్తున్నాడంటే?

గోల్కొండ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీకి చెందిన రమేశ్ ప్రైవేట్ ఉద్యోగి. తన కుమారుడు సూర్య, భార్యను తీసుకొని ఇబ్రహీంబాగ్ నుంచి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. అదే సమయంలో షేక్ పేట మారుతీనగర్ కాలనీకి చెందిన శ్రీనాథ్ అనే యువకుడు కారును మద్యం మత్తులో నడుపుతూ వేగంగా వచ్చి రమేశ్ బైక్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో చిన్నారి సూర్యకు తీవ్ర గాయాలు కాగా.. రమేశ్, అతని భార్యకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించే సమయానికే సూర్య మృతిచెందగా.. చిన్నారి తల్లిదండ్రులు చికిత్స పొందుతున్నారు. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. పోలీసులు కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తితోపాటు, కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. మద్యం సేవించి రాగ్ రూట్ లో కారు నడిపి చిన్నారి మృతికి కారణమైన నిందితుడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read : ఓ అరడజను మంది సభ్యత్వం రద్దు చేస్తే బుద్ధి వస్తుంది- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ ఫైర్

ఈ ఘ‌ట‌న‌పై గోల్కొండ ఇన్ స్పెక్ట‌ర్ సైదులు 10టీవీతో మాట్లాడుతూ.. ఉదయం తొమ్మిది గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం వచ్చింది. మారుతి బ్రెజా కారులో శ్రీనాధ్ అనే యువకుడు ప్రయాణిస్తూ హీరో హోండా బైక్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఏడు సంవత్సరాల వయసు ఉన్న సూర్య అక్కడికక్కడే మృతి చెందాడు. సన్ సిటీ నుంచి శ్రీనాథ్ ఓ పార్టీలో పాల్గొని తిరిగి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. శ్రీనాథ్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా 100 పాయింట్స్ వచ్చాయి. ఈ ప్రమాదానికి కారణం మద్యం మత్తు, అతివేగమే. శ్రీనాధ్ తండ్రి మేస్త్రీ గా పని చేస్తున్నాడు. చనిపోయిన బాలుడు సూర్య తండ్రి ప్రైవేట్‌ కంపెనీ లో ప‌ని చేస్తున్నాడు. రమేశ్‌ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సూర్య మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి త‌ర‌లించామ‌ని తెలిపారు.