Keerthy Suresh: చిరంజీవి డ్యాన్స్‌పై కీర్తి కామెంట్స్ దుమారం
మెగాస్టార్ చిరంజీవి కంటే తమిళ స్టార్ హీరో విజయ్ డ్యాన్స్..
మెగా అభిమానుల ఆగ్రహంతో హీరోయిన్ కీర్తి సురేశ్‌కి అవకాశాలు తగ్గిపోయినట్టేనా? మహానటితో మంచి గుర్తింపు తెచ్చుకుని… మెగాస్టార్ సిస్టర్‌గా గౌరవం దక్కించుకున్న కీర్తి సురేశ్‌పై మెగా అభిమానులకు కోపం ఎందుకు? చిరంజీవికి సారీ చెప్పాలని డిమాండ్ చేయడానికి కారణమేంటి?
టాప్ హీరోయిన్ కీర్తి సురేశ్ చిక్కుల్లో పడ్డారు. మరీ ముఖ్యంగా మెగా అభిమానులకు టార్గెట్‌గా మారారు. ఈ నెల 15న విడుదల కానున్న రఘు తాత సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నోరుజారిన కీర్తి సురేశ్ అనూహ్యంగా వివాదంలో చిక్కుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కంటే తమిళ స్టార్ హీరో విజయ్ డ్యాన్స్ బాగా చేస్తారని ఆమె చేసిన కామెంట్ మెగా అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది. డాన్స్‌లో సౌత్‌లోనే తిరుగులేని మెగాస్టార్‌ను కీర్తి సురేశ్ అవమానించారని మెగా అభిమానులు కన్నెర్ర చేస్తున్నారు. తక్షణం చిరంజీవికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, కీర్తి సురేష్ అన్నా చెల్లెలుగా భోళా శంకర్ సినిమాలో నటించారు. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ అమ్మాయిలా కీర్తి సురేశ్‌ను భావించారు మెగా ఫ్యాన్స్.. కట్ చేస్తే ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌కు టార్గెట్‌గా మారడమే ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.
మెగాస్టార్ డ్యాన్స్‌పై కీర్తి సురేశ్ చేసిన వ్యాఖ్యలతో ఫ్యాన్స్ తీవ్రంగా బాధపడుతున్నారని చెబుతున్నారు. ఇకపై టాలీవుడ్లో కీర్తికి అవకాశాలు ఇవ్వొద్దని తెగేసి చెబుతున్నారు. ఈ విషయంలో మెగాస్టార్ క్షమించినా, తాము మాత్రం క్షమించమని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కీర్తి సురేశ్ విషయంలో టాలీవుడ్ స్పందన ఆసక్తికరంగా మారింది.
Also Read : ప్రముఖ భరత నాట్యం, కూచిపూడి నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూత..