Hello Baby Trailer : హలో బేబీ ట్రైలర్ రిలీజ్.. ఒక్క పాత్రతో..

తాజాగా హలో బేబీ సినిమా ట్రైలర్ ని హీరో ఆది సాయి కుమార్ విడుదల చేసారు.

Hello Baby Trailer : హలో బేబీ ట్రైలర్ రిలీజ్.. ఒక్క పాత్రతో..

Solo Character Movie Hello Baby Trailer Released

Updated On : August 3, 2024 / 3:58 PM IST

Hello Baby Trailer : SKML మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాణంలో రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హలో బేబీ. ఒకే ఒక్క పాత్రతో ఈ సినిమా తెరకెక్కుతుంది. నటి కావ్య కీర్తి సోలో క్యారెక్టర్లో నటించింది.

తాజాగా హలో బేబీ సినిమా ట్రైలర్ ని హీరో ఆది సాయి కుమార్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ రిలీజ్ అనంతరం ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. సోలో క్యారెక్టర్ తో సినిమా తీయడం మెచ్చుకోవాల్సిన అంశం. హ్యాకింగ్ కథతో ఇలాంటి సింగిల్ క్యారెక్టర్ రావడం ఇదే మొదటిసారి. ఈ సినిమా మంచి విజయం సాధించాలి అని అన్నారు. హలో బేబీ ట్రైలర్ చూస్తుంటే ఒక ఇంట్లో ఒక సాఫ్ట్ వేర్ జాబ్ చేసే అమ్మాయిని ఆమె ఫోన్, ల్యాప్ టాప్ హ్యాక్ చేసి ఎవరు ఏం చేసారు అని థ్రిల్లింగ్ తో తెరకెక్కించినట్టు తెలుస్తుంది. హలో బేబీ ట్రైలర్ మీరు కూడా చూసేయండి..

ట్రైలర్ రిలీజ్ అనంతరం నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ.. హలో బేబీ సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ చేస్తాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫెస్టివల్, దాదా సాహెబ్ అవార్డులు ఈ సినిమాకి వచ్చాయి అని తెలిపారు.

Solo Character Movie Hello Baby Trailer Released