Durga temple: ఇంద్రకీలాద్రిపై భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. పూర్తి వివరాలు తెలిపిన ఈవో

ఇంటిదగ్గర వరలక్ష్మి వ్రతం చేయలేని వారికి 23వ తేదీన సామూహిక వరలక్ష్మీ..

Durga temple: ఇంద్రకీలాద్రిపై భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. పూర్తి వివరాలు తెలిపిన ఈవో

Vijayawada Durga temple

ఆషాడ మాసం చివరి రోజు ఆదివారం అమావాస్య కావడంతో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. దీనిపై ఈవో రామారావు మాట్లాడుతూ… ఆషాడ మాస నెల రోజులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

మహిళలు ఇప్పటివరకు దాదాపు 1500 వందల గ్రూపులుగా ఏర్పడి 50 వేల మంది.. అమ్మవారికి సారెలు సమర్పించారని రామారావు చెప్పారు. ఇవాళ అమావాస్య ఆదివారం కావడంతో భక్తులు తాకిడి విపరీతంగా పెరిగిందని వివరించారు.

చండీ హోమం శ్రీ చక్ర అర్చన ఖడ్గమాల అన్ని హోమాలలో భక్తులు పాల్గొంటున్నారని తెలిపారు. 16వ తేదీన వరలక్ష్మి వ్రతం ఉందని వరలక్ష్మి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారని చెప్పారు. ఇంటిదగ్గర వరలక్ష్మి వ్రతం చేయలేని వారికి 23వ తేదీన సామూహిక వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

Also Read: చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైసీపీ శ్రేణులపై దాడులను ఆపాలి.. : సామినేని ఉదయభాను