Friendship Day Gifts: బంధాలు బలపడాలంటే బహుమతులు ఇచ్చి పుచ్చుకోవాలి

చిన్నప్పుడు తాయిలం ఇచ్చుపుచ్చుకోవడం దగ్గర మొదలౌతుంది స్నేహం.

Friendship Day Gifts: బంధాలు బలపడాలంటే బహుమతులు ఇచ్చి పుచ్చుకోవాలి

Friendship Day Gifts

Friendship Day Gifts : స్నేహితుల మధ్య గిప్ట్‌లు ఇచ్చుకోవడం సర్వ సాధారణం. అయితే ఫ్రెండ్ షిప్ డే రోజు బహుమతులు ఇచ్చుకోవడం ప్రత్యేకం. స్నేహ బంధాన్ని గౌరవించుకోవడం.. ఒకరికొకరు కృతజ్ఞతలు చెప్పుకుంటూ బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల  స్నేహితుల మధ్య బంధం మరింత బలపడుతుంది.

స్నేహితులకు బహుమతి ఇవ్వాలంటే ఎలాంటి బహుమతి ఇవ్వాలా? అని చాలా ఆలోచిస్తాం. వారి అభిరుచికి తగ్గట్లు, అది వారికి ఉపయోగపడేట్లు ఇవ్వాలని అనుకుంటాం. ఫ్రెండ్ షిప్ డే  వంటి  ప్రత్యేకమైన రోజు వారికి ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమతి ఇవ్వాలని అనుకుంటారు. అయితే ఎలాంటి బహుమతి ఇస్తే బాగుంటుంది? కొన్ని ఐడియాలు మీ కోసం.

వారి ఫోటో ఫిక్స్ చేసిన ఫోటో ఫ్రేమ్ బహుమతిగా ఇస్తే భలే ఉంటుంది. ఫోటోలు కొన్ని జ్ఞాపకాలను భద్రంగా ఉంచుతాయి. అలాగే పెర్ఫ్యూమ్ బహుమతిగా ఇచ్చినా బావుంటుంది. మీ మనసులో వారికి ప్రత్యేకమైన స్ధానం ఉందని చెబుతూ మీ స్నేహ పరిమళం లాగనే సువాసనలు పంచే పెర్ఫ్యూమ్ ఇవ్వడం బాగుంటుంది. సన్ గ్లాసెస్ బహుమతిగా ఇవ్వొచ్చు. అది వారికి ఎండలో వాడుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. వారికి ఇష్టమైన షేడ్స్‌లో ఎంపిక చేసి ఇస్తే ఎంతో బాగుంటుంది.

స్నేహితులతో గడపాలి
స్నేహితులతో గడిపే సమయం చాలా విలువైనది. సమయానికి గుర్తుగా వారికి స్మార్ట్ వాచ్ బహుమతిగా ఇవ్వండి. మీ ఫ్రెండ్ తో గడిపిన ప్రతి సమయాన్ని మీరు గుర్తు పెట్టుకుంటారని ఆ బహుమతి చూపిస్తుంది. మీ ఫ్రెండ్‌కి పుస్తకాలు చదవడం అంటే ఇష్టమైతే మంచి పుస్తకం కొని బహుమతిగా ఇవ్వండి. మీ ఫ్రెండ్ ఎప్పటి నుంచో చదవాలని అనుకున్న రచయిత పుస్తకం మార్కెట్లో దొరికితే వెంటనే దానికి కొని వారికి బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేయండి.

ఆడవారైతే స్కిన్ కేర్ ప్రాడక్ట్స్, బ్యూటీ ప్రాడక్ట్స్ ఇష్టపడుతుంటారు. మంచి సువానలు వచ్చే క్యాండిల్స్ అలాంటివి కూడా బహుమతులుగా ఇవ్వొచ్చు. కొందరికి చాక్లెట్స్ అంటే ఇష్టపడతారు. కొండరు గాడ్జెట్స్ ఇష్టపడతారు. ఫిటెనెస్ ట్రాకర్లు, పోర్టబుల్ స్పీకర్లు, పవర్ బ్యాంక్‌లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. కొంతమందికి సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టపడతారు. అందమైన టెడ్డీ బేర్, మెత్తటి బన్నీ అయినా బహుమతిగా ఇవ్వండి.

కొందరికి మొక్కలంటే ప్రాణం. అలాంటి వారికి చక్కని ఇండోర్ ప్లాంట్స్ కొని బహుమతిగా ఇవ్వండి. అవి పెరుగుతూ ఉంటే మీ బంధాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. ఇలా మీ బెస్ట్ ఫ్రెండ్స్ అభిరుచికి తగ్గట్లు మీరు బహుమతులు ప్లాన్ చేసుకోండి. స్నేహితుల దినోత్సవం రోజు వారికి ఇచ్చి మీ సంతోషాన్ని పంచుకోండి.

Also Read : భారీ బ్యాటరీతో ఐఫోన్ 16 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు లీక్.. లాంచ్ ఎప్పుడు ఉండొచ్చుంటే?