Parthasarathy: అంత ఘోరంగా ఓడించినప్పటికీ ఆయనకు ఇంకా బుద్ధి రాలేదు: మంత్రి పార్థసారథి
టిడ్కో బాధితులను వైసీపీ సర్కారు మానసికంగా హింసించిందని, తాము న్యాయం చేస్తామని పార్థసారథి చెప్పారు.
ప్రజలు అంత ఘోరంగా ఓడించినప్పటికీ వైసీపీ అధినేత జగన్‌కు ఇంకా బుద్ధి రాలేదంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శలు గుప్పించారు. ఇవాళ పార్థసారధి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ… ప్రజల్లో తనకున్న కాస్త నమ్మకాన్ని కూడా జగన్ పోగొట్టుకుంటున్నారని తెలిపారు.
టిడ్కో బాధితులను వైసీపీ సర్కారు మానసికంగా హింసించిందని, తాము న్యాయం చేస్తామని పార్థసారథి చెప్పారు. వైసీీపీ హయాంలో జరిగిన భూబాగోతంపై విచారణ జరిపిస్తామని, రైతుల భూములను తక్కువ ధరకుకొని ప్రభుత్వానికే ఎక్కువ ధరకు అమ్మిన ఘనులు వైసీపీ నేతలని ఆరోపించారు.
వల్లభనేని వంశీ అరెస్టుకు, సర్కారుకు ఎటువంటి సంబంధమూ లేదని తెలిపారు. తమ ప్రభుత్వం ఎక్కడా కక్షపూరితంగా వ్యవహరించడం లేదని చెప్పారు. కాగా, తాము కక్ష సాధింపు చర్యలకు దిగబోమని కూటమి సర్కారు మొదటి నుంచీ చెబుతోంది. అయితే, నారా లోకేశ్ రెడ్ బుక్‌లో రాసుకున్న విధంగానే కూటమి సర్కారు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది.
Also Read: రాహుల్ గాంధీ మార్ఫింగ్ ఫొటోను షేర్ చేసిన కంగనా రనౌత్.. సోషల్ మీడియాలో వైరల్.. నెటిజన్లు ఆగ్రహం