రాహుల్ గాంధీ మార్ఫింగ్ ఫొటోను షేర్ చేసిన కంగనా రనౌత్.. సోషల్ మీడియాలో వైరల్.. నెటిజన్లు ఆగ్రహం

కంగనా చేసిన పోస్టు సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంది. చాలా మంది నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. కంగనా పార్లమెంట్ కు అనర్హురాలిగా పేర్కొంటున్నారు.

రాహుల్ గాంధీ మార్ఫింగ్ ఫొటోను షేర్ చేసిన కంగనా రనౌత్.. సోషల్ మీడియాలో వైరల్.. నెటిజన్లు ఆగ్రహం

Kangana Ranaut

Kangana Ranaut : లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి విమర్శల దాడి చేశారు. ఇటీవల పార్లమెంట్ లో కుల గణనపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో రాహుల్ గాంధీ మార్ఫింగ్ ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో రాహుల్ గాంధీ నుదుటిపై పసుపు, ఎర్రబొట్టు, తలపై టోపీ, మెడలో ఏసు క్రీస్తు శిలువ గుర్తుతో ఉంది. ఈ ఫొటోపై ఎవరి కులాన్ని అడగకుండా కుల గణనను నిర్వహించాలనుకునేవాడు అని రాసి ఉంది.

Also Read : చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైసీపీ శ్రేణులపై దాడులను ఆపాలి.. : సామినేని ఉదయభాను

కంగనా చేసిన పోస్టు సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంది. చాలా మంది నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. కంగనా పార్లమెంట్ కు అనర్హురాలిగా పేర్కొంటున్నారు. కంగనా రనౌత్ అనారోగ్యంతో ఉంది.. ఆమెను శిక్షించకుండా వదిలేయవద్దు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు.. మీ ద్వేషానికి సమాధానం ఇస్తారు అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగనా రనౌత్ సిగ్గుపడాలి.. మీ తల్లిదండ్రులు మీకు ఎలాంటి మర్యాదలు నేర్పలేదనుకుంటా.. దయచేసి కాంగ్రెస్ పార్టీ ఆమెపై చర్యలు తీసుకోండి అంటూ పేర్కొన్నారు. మరికొందరు కంగనా చేసిన పోస్టుకు మద్దతు తెలుపుతున్నారు.

Kangana Ranaut

Also Read : Paris Olympics 2024 : బంపర్ ఆఫర్.. నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే అందరికీ ఉచిత వీసా.. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు

ఓ నెటిజన్.. ఒక పార్టీలో ఆమె డ్యాన్స్ వీడియోను షేర్ చేశాడు. మండికి చెందిన ఒక బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అందమైన నృత్యం. ఆమె రాహుల్ గాంధీకి డ్రగ్ టెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది, ఇప్పుడు ఆమెకు డ్రగ్ టెస్ట్ చేయమని ఎవరు కోరుకుంటున్నారు? రాశాడు.


మండి నియోజకవర్గంలో ఇటీవల జరిగిన విధ్వంసంపై ఒక వినియోగదారు ఎంపీని ప్రశ్నిస్తూ.. మీ నియోజకవర్గంలో వరదలు, కొండచరియలు విధ్వంసంతో అల్లకల్లోలం అవుతున్నప్పుడు మీరు ఇంకా నిద్రపోతున్నారా? అంటూ ప్రశ్నించాడు.