అయ్యో.. వినోద్ కాంబ్లీకి ఏమైంది..? షాకింగ్ వీడియో వైరల్.. నడవలేని స్థితిలో మాజీ క్రికెటర్

భారత క్రికెట్ జట్టు మాజీ స్టార్ వినోద్ కాంబ్లీ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయ్యో.. వినోద్ కాంబ్లీకి ఏమైంది..? షాకింగ్ వీడియో వైరల్.. నడవలేని స్థితిలో మాజీ క్రికెటర్

Vinod Kambli

Vinod Kambli Video viral : భారత క్రికెట్ జట్టు మాజీ స్టార్ వినోద్ కాంబ్లీ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో వినోద్ కాంబ్లీ నడవలేక కిందపడిపోతుండటంతో స్థానికులు అతన్ని పట్టుకొని పక్కకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అయ్యో.. వినోద్ కాంబ్లీకి ఏమైంది అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Also Read : ICC : ఐసీసీ అవార్డు రేసులో ఉన్న ముగ్గురు టీమ్ఇండియా ప్లేయ‌ర్లు.. ఎవ‌రో తెలుసా..?

వీడియోలో వినోద్ కాంబ్లీ పరిస్థితిని చూస్తే అతను తప్పతాగి నడవలేక కిందపోతున్నట్లు ఉందని కొందరు నెటిజన్లు పేర్కొంటుండగా.. మరికొందరు అతను కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బహుశా అనారోగ్య కారణాల వల్ల కాంబ్లీ నడవలేక కిండపడి పోయాడని మరికొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. మరికొందరు ..సచిన్ టెండూల్కర్ అతనికి ఆశ్రయం కల్పించి అతను మంచిస్థితికి వచ్చేలా చూడాలని మరికొందరు నెటిజన్లు కోరుతున్నారు. అయితే, కాంబ్లీకి ప్రస్తుతం 52ఏళ్లు. అతను 2013లో కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడ్డాడు. అంతకుముందు సంవత్సరం ధమనులలోని రెండు బ్లాకులకు చికిత్స చేయడానికి వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారని తెలిసింది.

Also Read : Stunning Catch : క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఇలాంటి క్యాచ్‌ను ఎప్పుడూ చూసి ఉండ‌రు.. దీన్ని ఏమ‌ని పిలవాలో కాస్త చెప్ప‌రూ..?

వినోద్ కాంబ్లీ భారత్ తరపున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. 1991లో షార్జాలో పాకిస్థాన్ జట్టుతో జరిగిన వన్డేలో అతను అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. మొత్తం 121 మ్యాచ్ లు ఆడిన అతను 3,561 పరుగులు చేశాడు. కాంబ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగిన కొద్దికాలంలోనే తన అద్భుతమైన బ్యాటింగ్ తో అనేక రికార్డులను నెలకొల్పాడు.