New SBI Chairman : ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు సెట్టి నియామకం!
New SBI Chairman : ఎస్బీఐ ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు సెట్టి నియామకాన్ని ఆమోదించినట్లు కేబినెట్ నియామకాల కమిటీ (ACC) ప్రకటించింది. ఆగస్టు 28, 2024న లేదా ఆ తర్వాత ఆయన పదవి బాధ్యతలను చేపట్టనున్నారు.

Govt names Challa Sreenivasulu Setty as new SBI Chairman
New SBI Chairman : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు సెట్టి నియామకాన్ని ఆమోదించినట్లు కేబినెట్ నియామకాల కమిటీ (ACC) ప్రకటించింది. ఆగస్టు 28, 2024న లేదా ఆ తర్వాత ఆయన పదవి బాధ్యతలను చేపట్టనున్నారు.
Read Also : Youtube Academy : ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు చర్చలు..!
ఏసీసీ ప్రకటన ప్రకారం.. సెట్టీ పదవీకాలం మూడేళ్లపాటు కొనసాగుతుంది. గతంలో, జూలై 3న, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని స్వయంప్రతిపత్త సంస్థ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (FSIB) ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన సెట్టిని బ్యాంక్ తదుపరి ఛైర్మన్‌గా సిఫార్సు చేసింది.
అదనంగా, ప్రస్తుతం ఎస్బీఐలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (DMD)గా పనిచేస్తున్న రాణా అశుతోష్ కుమార్ సింగ్‌ను మేనేజింగ్ డైరెక్టర్ పదవికి నియమించడాన్ని ఏసీసీ ఆమోదించింది. శెట్టి పదవీకాలం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ప్రారంభం కానుంది. జూన్ 30, 2027న ఆయన పదవీ విరమణ వయస్సు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే కొనసాగనున్నారు.
కొత్త ఎస్బీఐ చైర్మన్‌గా ఎంపికైన చల్లా శ్రీనివాసులు.. బ్యాంకు రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ అధిపతిగా ఉన్నారు. ఏజీబీఎస్సీ కంప్లీట్ చేసిన శ్రీనివాసులు శెట్టి.. సర్టిఫైడ్ అసోసియేట్ ఆఫ్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్‌లో పట్టా కూడా పొందారు. 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్బీఐలో తన కెరీర్ ప్రారంభించారు. 30 ఏళ్లకు పైగా ఎస్బీఐలో సేవలందించిన శెట్టి.. ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, కార్పొరేట్ క్రెడిట్, డిజిటల్, రిటైల్ మార్కెట్లలో బ్యాంకింగ్ విభాగాల్లో అనుభవం ఉంది.
అంతకుముందు 2020 అక్టోబర్ 7వ తేదీన ప్రస్తుత ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా ఎంపికయ్యారు. గతేడాది అక్టోబర్‌లో ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. వయస్సు 63 ఏళ్లు వచ్చే వరకూ పదవీకాలాన్ని పొడిగించింది. ఈ ఏడాది ఆగస్టు 28 వరకూ దినేష్ కుమార్ ఖరా కొనసాగనున్నారు.
Read Also : 2G Bioethanol Plant : తెలంగాణలో 2జీ బయో ఇథనాల్ ప్లాంట్ .. కొత్తగా 500 మందికి ఉద్యోగాలు