Niharika – Chiranjeevi : నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రాళ్లు సినిమా.. ఫస్ట్ రివ్యూ చెప్పిన మెగాస్టార్..
తాజాగా కమిటీ కుర్రాళ్లు సినిమాని మెగాస్టార్ చిరంజీవి చూసి రివ్యూ ఇస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసారు.
![Niharika – Chiranjeevi : నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రాళ్లు సినిమా.. ఫస్ట్ రివ్యూ చెప్పిన మెగాస్టార్.. Niharika – Chiranjeevi : నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రాళ్లు సినిమా.. ఫస్ట్ రివ్యూ చెప్పిన మెగాస్టార్..](https://10tv.in/wp-content/uploads/2024/08/niharika-chiranjeevi.jpg)
Niharika Producing Film Committee Kurrollu First Review by Megastar Chiranjeevi
Niharika – Chiranjeevi : నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా తెరకెక్కించింది. యదువంశీ దర్శకత్వంలో 11 మంది కొత్త నటీనటులు మెయిన్ లీడ్స్ తో గోదావరి నేపథ్యంలో కమిటీ కుర్రాళ్ళు సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ వచ్చి ప్రేక్షకులని మెప్పించాయి. కమిటీ కుర్రాళ్ళు సినిమా ఆగస్టు 9న రిలీజ్ కాబోతుంది.
నిన్నే కమిటీ కుర్రాళ్ళు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఈ ఈవెంట్ కు వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, అడివి శేష్ వచ్చి సందడి చేసారు. తాజాగా ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి చూసి రివ్యూ ఇస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసారు.
Also Read : Tharun Bhascker : నెమళ్లకు ఫుడ్ తినిపిస్తున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్, అతని తల్లి.. క్యూట్ వీడియో చూశారా?
చిరంజీవి ఈ వీడియోలో మాట్లాడుతూ.. మా నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ఆగస్టు 9న రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాని నేను అందరికంటే ముందే చూసాను. చాలా బాగుంది. నన్ను ఇంప్రెస్ చేసారు. ఈ సినిమా గోదావరి జిల్లాలోని ఒక పల్లెటూళ్ళో 11 మంది స్నేహితుల మధ్య జరిగే కథ. నిహారిక మల్టీ ట్యాలెంటెడ్. మంచి ఆర్టిస్ట్ మాత్రమే కాదు ఒక నిర్మాతగా కూడా మంచి అభిరుచి ఉంది. లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టు, ఆడియన్స్ టేస్ట్ తెలుసుకొని సినిమాలు తెరకెక్కిస్తోంది. అలాగే మన తెలుగు ప్రేక్షకులు కొత్త కంటెంట్ వస్తే చూసి ఎంకరేజ్ చేస్తారు, ఆనందిస్తారు. డైరెక్టర్ యదు వంశీకి ఇది మొదటి సినిమా. ఈ సినిమాతో చాలా మంది కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. ఇది పరిశ్రమకు చాలా మంచి విషయం. హనుమాన్ సినిమాకు రెండు పాటలకు సంగీతం అందించిన అనుదీప్ దేవ్ ఈ కమిటీ కుర్రాళ్ళు సినిమాకు కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. కమిటీ కుర్రాళ్ళు పాటలన్ని బాగున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులని అలరిస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమాలో నటించిన వాళ్లందరికీ, సినిమాకి పనిచేసిన వాళ్లందరికీ, ముఖ్యంగా మా నిహారికకి ఈ కమిటీ కుర్రాళ్ళు సినిమా మంచి పేరు, అవార్డులు, రివార్డులు రావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. దీంతో మెగాస్టార్ వీడియో వైరల్ గా మారింది. మరి ఈ కమిటీ కుర్రాళ్ళు సినిమా ప్రేక్షకులని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.
A MEGA BLESSING to #CommitteeKurrollu ❤️❤️
Megastar @KChiruTweets garu conveyed his best wishes to the team for their theatrical release ✨️
See you in theatres from 9th August#CKonAUG9 🍿@IamNiharikaK @PinkElephant_P @SRDSTUDIOS_ @yadhuvamsi92 @eduroluraju @anudeepdev… pic.twitter.com/1fooRlGzLU
— Beyond Media (@beyondmediapres) August 6, 2024