Tharun Bhascker : నెమళ్లకు ఫుడ్ తినిపిస్తున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్, అతని తల్లి.. క్యూట్ వీడియో చూశారా?

తాజాగా తరుణ్ తన తల్లి గీతా భాస్కర్ తో కలిసి సింగపూర్ కి వెకేషన్ కి వెళ్లినట్టు సమాచారం.

Tharun Bhascker : నెమళ్లకు ఫుడ్ తినిపిస్తున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్, అతని తల్లి.. క్యూట్ వీడియో చూశారా?

Tharun Bhascker and his Mother Geetha Bhascker Enjoying Vacation With Peacocks

Updated On : August 6, 2024 / 1:00 PM IST

Tharun Bhascker : పెళ్లి చూపులు, ఏమైంది ఈ నగరానికి, కీడాకోలా సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. అయితే తరుణ్ ప్రస్తుతం దర్శకుడిగానే కాక నటుడిగా, వేరే వర్క్స్ తో కూడా బిజీ అవుతున్నాడు. తాజాగా తరుణ్ తన తల్లి గీతా భాస్కర్ తో కలిసి సింగపూర్ కి వెకేషన్ కి వెళ్లినట్టు సమాచారం.

Also Read : Kavya Thapar : ఆడిషన్ కి వెళ్తే రిజెక్ట్ చేసి.. ఆ సినిమా పార్ట్ 2కి కావాలని మరీ ఈ హీరోయిన్ ని తీసుకున్న పూరీ..

తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్ కూడా బాగా చదువుకొని జాబ్స్ చేసారు. ప్రస్తుతం ఓ కంపెనీ నడిపిస్తూ, రచయితగా కూడా మారారు. గీతా భాస్కర్ కూడా తన వర్క్స్ తో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా తరుణ్ – గీతాభాస్కర్ కలిసి సింగపూర్ దగ్గర సెంటోసా ఐస్ ల్యాండ్ కి వెకేషన్ కి వెళ్లినట్టు తెలుస్తుంది. అక్కడ నెమళ్ళ పార్క్ లో వీరిద్దరూ సరదాగా నెమళ్లతో గడుపుతూ సేదతీరుతున్నారు. తరుణ్, గీతా భాస్కర్ నెమళ్లకు ఫుడ్ తినిపిస్తున్న క్యూట్ వీడియోని గీతా భాస్కర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ క్యూట్ వీడియో వైరల్ గా మారింది.