Pawan Kalyan – OG : పవన్ పుట్టిన రోజుకి OG నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్‌కి డైరెక్టర్ సుజీత్ ట్రీట్..

తాజాగా ఓ పవన్ ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త టాలీవుడ్ లో వినిపిస్తుంది.

Pawan Kalyan – OG : పవన్ పుట్టిన రోజుకి OG నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్‌కి డైరెక్టర్ సుజీత్ ట్రీట్..

Pawan Kalyan They Call Him OG Movie Update on his Birthday Rumours goes Viral

Pawan Kalyan – OG : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం అవ్వడంతో ఏపీలో ఫుల్ బిజీగా ఉన్నారు. చేతిలో ఉన్న మూడు సినిమాలను కుదిరినప్పుడు డేట్స్ ఇచ్చి పూర్తిచేస్తానని ఆల్రెడీ ఫ్యాన్స్ కి మాట ఇచ్చాడు పవన్. పవన్ చేతిలో ఉన్న మూడు సినిమాల్లో OG సినిమాపైనే ఫ్యాన్స్ కి అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే OG సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ అదిరిపోయింది. అందులో పవన్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చాయి.

పవన్ కళ్యాణ్ ఒక రెండు వారాల డేట్స్ ఇస్తే OG సినిమా షూట్ అయిపోతుందని సమాచారం. అయితే తాజాగా ఓ పవన్ ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త టాలీవుడ్ లో వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న OG సినిమా నుంచి ఓ స్పెషల్ టీజర్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటివరకు షూట్ చేసిన దాంట్లోంచి మరింత పవర్ ఫుల్ విజువల్స్ తీసి గ్లింప్స్ ని మించేలా OG టీజర్ సుజీత్ కట్ చేస్తున్నాడని తెలుస్తుంది.

Also Read : Kamal Hassan : క‌మ‌ల్ హాస‌న్ కీల‌క నిర్ణ‌యం.. బిగ్‌బాస్‌కు గుడ్ బై.. కొత్త హోస్ట్ ఎవ‌రంటే..?

దీంతో ఈ వార్త వైరల్ అవ్వడంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా డిప్యూటీ సీఎం అయ్యాడని సంతోషపెడుతున్న ఫ్యాన్స్ సినిమాల గురించి మాత్రం ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు పవన్ పుట్టిన రోజుకి డైరెక్టర్ సుజీత్ OG టీజర్ రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతారు. ఇక OG సినిమా పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు పూర్తిచేసి 2025 లో రిలీజ్ చేస్తారని సమాచారం.