దివ్వల మాధురి క్యారెక్టర్ ఏంటో టెక్కలిలో అందరికీ తెలుసు.. అంతేకాదు: దువ్వాడ వాణి, హైందవి 

తానేం చిన్నపిల్లను కాదని హైందవి తెలిపారు. తన తల్లి బ్రెయిన్ వాష్ చేసేదేమీ లేదని, తామే ఎటాక్ చేయాలనుకుంటే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్..

దివ్వల మాధురి క్యారెక్టర్ ఏంటో టెక్కలిలో అందరికీ తెలుసు.. అంతేకాదు: దువ్వాడ వాణి, హైందవి 

దివ్వెల మాధురి ఎవరో తనకు తెలియదని, తానేమీ ఆమెను రాజకీయాల్లోకి తీసుకురాలేదని దువ్వాడ వాణి అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మాధురి క్యారెక్టర్ సరైనది కాకపోవడంతో గ్రహించి దువ్వాడ శ్రీనును హెచ్చరించానని తెలిపారు. పార్టీకి డ్యామేజ్ అవుతుందని అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్లానని చెప్పారు.

దువ్వాడ శ్రీను బర్త్ డేకి ఆమె డాన్స్ చేసిందని, అప్పుడు తాను కండువా వేశానని, ఆరోజు అనేకమంది కండువా వేశానని తెలిపారు. ఫేక్ ఫొటోలతో మాధురి ప్రచారం చేస్తోందని చెప్పారు. పిల్లలు వాళ్ల నాన్నను కలవడానికి ఇంటికి వస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారని తెలిపారు. తనకు రాజకీయ ఆకాంక్ష ఎందుకు ఉంటుందని, తన ఫ్యామిలీయేూ రాజకీయ ఫ్యామిలీ అని, తాను ఎంపీటీసీ, జడ్పీటీసీగా పనిచేశానని అన్నారు.

తాను చెబితే వినడానికి తమ పిల్లలు చిన్న పిల్లలు కాదని, ఇద్దరూ డాక్టర్లని తెలిపారు. దివ్వల మాధురి క్యారెక్టర్ ఏంటో టెక్కలిలో అందరికీ తెలుసని, ఆమెకు భర్తతోపాటు అనేక ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయని ఆరోపించారు. తన భర్తను ట్రాప్ చేసి తమ భవిష్యత్తులతో ఆడుకుంటోందని చెప్పారు. తనపై ఫిర్యాదు చేశాకే తాము తిరిగి ఫిర్యాదు చేశామని అన్నారు.

నేను చిన్నపిల్లను కాదు: హైందవి 

దువ్వాడ శ్రీను కుమార్తె దువ్వాడ హైందవి మాట్లాడుతూ.. ఎవరు దాడి చేశారో అందరికీ తెలుసని, తమ తండ్రి తమపై గ్రానైట్ రాయితో ఎటాక్ చేయబోయారని అన్నారు. తమ తండ్రితో మాట్లాడడానికి మాత్రమే వచ్చామని, తానేం చిన్నపిల్లను కాదని తెలిపారు. తన తల్లి బ్రెయిన్ వాష్ చేసేదేమీ లేదని, తామే ఎటాక్ చేయాలనుకుంటే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేస్తామని ప్రశ్నించారు.

అనేకసార్లు కలుద్దామని, మాట్లాడదామని మెసేజ్ పెట్టానని, తన తండ్రి కనీసం రిప్లై ఇవ్వట్లేదని అన్నారు. డోర్ కొట్టినా ఎవరూ తీయడం లేదని, అందుకేలోనికి వచ్చి తాము కూర్చున్నామని తెలిపారు. పార్టీలో పనిచేయాలంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోమని కాదు కదా అని నిలదీశారు. రెండు సంవత్సరాలుగా తమ తండ్రి ఫోన్లు, మెసేజ్ లకు స్పందించలేదని, తమ మామయ్య చనిపోయినప్పుడు కూడా చెప్పినా కనీసం రాలేదని అన్నారు.

Also Read: కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారన్న నమ్మకం ఉంది: బండి సంజయ్