విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. కూటమి అభ్యర్థి అతడే?

వైసీపీ అభ్యర్థిగా ఇప్పటికే బొత్స సత్యనారాయణ పేరు ఖరారు కావడంతో కూటమి తరుపున అభ్యర్థిని బరిలోకి దింపాలని టీడీపీ నిర్ణయించింది.

విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. కూటమి అభ్యర్థి అతడే?

Updated On : August 9, 2024 / 8:17 PM IST

Visakha Mlc Election : ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నికపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఉండవల్లి నివాసంలో విశాఖ జిల్లా నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. వైసీపీ అభ్యర్థిగా ఇప్పటికే బొత్స సత్యనారాయణ పేరు ఖరారు కావడంతో కూటమి తరుపున అభ్యర్థిని బరిలోకి దింపాలని టీడీపీ నిర్ణయించింది. ఇవాళ్టి భేటీలో కూటమి తరుపున ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేసే ఛాన్స్ ఉంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పీలా గోవింద్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

చంద్రబాబు నివాసంలో జరుగుతున్న సమావేశానికి మిత్ర పక్షాల నేతలు కూడా హాజరయ్యారు. విశాఖ జిల్లాకు చెందిన నేతలంతా అటెండ్ అయ్యారు. జనసేన, బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఎలాగైనా ఈ సీటుని కైవసం చేసుకోవాలని కూటమి నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. సంఖ్యాపరంగా వైసీపీకి బలం ఉన్నా.. అధికారం మారిన తర్వాత మూకుమ్మడిగా అంతా టీడీపీలో చేరుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ దక్కించుకోవడం ఖాయం అని కూటమి ధీమాగా ఉంది.

టీడీపీ నుంచి ప్రధానంగా నలుగురు పోటీ పడుతున్నారు. పీలా గోవింద్ అనకాపల్లి సీటుని త్యాగం చేశారు. పొత్తులో భాగంగా ఆ సీటు జనసేకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆయన అభ్యర్థి రేసులో ముందున్నారు. గవర సామాజిక వర్గానికి చెందిన బీసీ నేత. విశాఖలో గవర సామాజికవర్గం అత్యంత ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో పీలా గోవింద్ ను బరిలోకి దింపాలని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

కోరాడ రాజబాబు కూడా రేసులో ఉన్నారు. ఆయన ఆశించిన భీమిలి సీటుని ఆఖరి నిమిషంలో గంటాకు ఇచ్చారు. గండి బాబ్జీ కూడా రేసులో ఉన్నారు. విశాఖ సౌత్ నుంచి సీటు ఆశించారు గండి బాబ్జీ. పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు వెళ్లింది. విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న గండి బాబ్జీ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆశిస్తున్నారు. ఇక బైరా దిలీప్ కూడా రేసులో ఉన్నారు. ఆయన అనకాపల్లి పార్లమెంటు సీటు ఆశించారు. మొత్తంగా అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని కూటమి నేతలు చంద్రబాబుకే అప్పగించారు. అయితే, పీలా గోవింద్ వైపే ఎక్కువ మంది నేతలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

Also Read : సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు..! కేతిరెడ్డిలో సడెన్‌గా ఎందుకింత మార్పు, ఆ పార్టీలో చేరతారా?