Cotton Cultivation : కురుస్తున్న వర్షాలు.. పత్తిని కాపాడుకునే చర్యలు

Cotton Cultivation : పత్తిని పండించే ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఉత్పత్తి, ఎగుమతులలో రెండవ స్థానాన్ని ఆక్రమించింది. మహారాష్ట్ర, గుజరాత్‌‌ తరువాత తెలుగు రాష్ట్రాలు ప్రత్తి సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉన్నాయి.

Cotton Cultivation : కురుస్తున్న వర్షాలు.. పత్తిని కాపాడుకునే చర్యలు

Cotton Cultivation

Cotton Cultivation : తెలుగు రాష్ట్రాల్లోని మెట్టప్రాంతాల్లో…  వర్షాధారంగా పత్తి విస్తారంగా సాగవుతోంది. ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా పలకరించాయి. అయినా తెలంగాణలో పత్తిని చాలా వరకు విత్తారు. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో ఆగష్టు వరకు పత్తి విత్తుకునే వీలుంది.  ప్రస్థుతం కొన్నిప్రాంతాల్లో అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో పంటలను గట్టెక్కించేందుకు పాటించాల్సిన సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. రాజేశ్వర్ నాయక్.

Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు

పత్తిని పండించే ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఉత్పత్తి , ఎగుమతులలో రెండవ స్థానాన్ని ఆక్రమించింది. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్‌‌ల తరువాత తెలుగు రాష్ట్రాలు ప్రత్తి సాగు విస్తీర్ణం , ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉన్నాయి. అయితే, గతఏడాది మార్కెట్ లో పత్తికి అధిక ధర పలకడం.. ఈ ఏడాది పత్తి సాగుకే మొగ్గుచూపారు  రైతులు.  ప్రస్తుతం 20 నుండి 25 రోజుల దశలో పత్తి ఉంది.

అయితే, ఇటీవల కురుస్తున్న వరుస  వర్షాలకు చాలా చోట్ల పంట దెబ్బతింది. ఈ పంటలను రికవరీ చేయాలంటే సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. రాజేశ్వర్ నాయక్. సరైన ఎరువుల యాజమాన్యం చేపట్టకపోతే 10-20 శాతం దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి శాస్త్రవేత్తల సూచన ప్రకారం రైతులు సమయానుకూలంగా ఎరువులు, సూక్ష్మపోషకాల యాజమాన్యం చేపడితే నాణ్యమైన అధిక దిగుబడి తీసుకునే అవకాశం ఉంది.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు