బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం.. కేసీఆర్, కేటీఆర్ పదవులు అవే.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ గవర్నర్ కాబోతున్నారంటూ ..

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం.. కేసీఆర్, కేటీఆర్ పదవులు అవే.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లిన ఆయన మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యమని చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిన తరువాత మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు ఇచ్చే పదవులు ఏమిటో కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ కు గవర్నర్ పదవి ఇస్తారని, కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతారని రేవంత్ చెప్పారు. ఇక హరీశ్ రావు తెలంగాణలో ప్రతిపక్ష నేత అవుతారని అన్నారు.

Also Read : బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ ప్రచారం.. కేటీఆర్ ఏమన్నారంటే..

తెలంగాణ రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందని విస్తృత ప్రచారం జరుగుతుంది. అయితే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీలో విలీనం అయ్యే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ప్రచారాన్ని ఖండించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యమని సంచలన వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.