ఆసుపత్రులు శుభ్రంగా ఉండాలి.. రోగులు ఆసుపత్రికి రాగానే మంచి వాతావరణం కనిపించాలి: మంత్రి సత్యకుమార్

అయితే, స్ట్రెచర్స్, వీల్ ఛైర్స్ సరిగ్గా పని చేయట్లేదని, శానిటేషన్ ఇబ్బంది ఉందని తెలిపారు.

ఆసుపత్రులు శుభ్రంగా ఉండాలి.. రోగులు ఆసుపత్రికి రాగానే మంచి వాతావరణం కనిపించాలి: మంత్రి సత్యకుమార్

Satya Kumar

ఆరోగ్యశాఖ మంత్రిగా తాను బాధ్యతలు చేపట్టి 2 నెలలు పూర్తయిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఈ రెండు నెలల్లో ప్రభుత్వ ఆసుపత్రులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించానని తెలిపారు. ఇప్పుడు ఉన్న సిబ్బందితోనే ప్రజలకు మెరుగైన వైద్యం అందించవచ్చని భావిస్తున్నామని అన్నారు.

అయితే, స్ట్రెచర్స్, వీల్ ఛైర్స్ సరిగ్గా పని చేయట్లేదని, శానిటేషన్ ఇబ్బంది ఉందని తెలిపారు. శానిటేషన్ సిబ్బందికి ఏజెన్సీ జీతాలు ఇవ్వడం లేదని, కడప ప్రభుత్వ ఆసుపత్రికి మంచి నీటి కొరత ఉందని చెప్పారు. ఆసుపత్రులు శుభ్రంగా ఉండాలని, రోగులు ఆసుపత్రికి రాగానే మంచి వాతావరణం కనిపించాలని తెలిపారు. ఆసుపత్రులకు వచ్చే వారిలో ఎక్కువుగా నిరక్షరాస్యులు ఉంటారని, సైన్ బోర్డులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఆసుపత్రిలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ప్రతి ఆసుపత్రిలో విజుబుల్ ప్రాంతంలో హెల్ప్ బోర్డ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆసుపత్రికి వచ్చిన రోగికి అరగంటలో చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఉదయం ఓపీ చూసిన డాక్టర్.. మధ్యాహ్నం రెండో ఓపీ కూడా చూడాలని అన్నారు. రోగులు ప్రయివేటు సెంటర్లలో టెస్టులు చేసుకోకుండా అన్ని సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉండేలా చూస్తామని తెలిపారు.

Also Read: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం