Devineni Avinash : వైసీపీ నేత దేవినేని అవినాశ్‌కు షాకిచ్చిన మంగళగిరి పోలీసులు

వైసీపీ నేత దేవినేని అవినాశ్ కు మంగళగిరి పోలీసులు షాకిచ్చారు. విదేశాలకు వెళ్ళేందుకు అవినాశ్ వేసిన ప్లాన్ ను పోలీసులు పటాపంచలు చేశారు.

Devineni Avinash : వైసీపీ నేత దేవినేని అవినాశ్‌కు షాకిచ్చిన మంగళగిరి పోలీసులు

Devineni Avinash

Updated On : August 16, 2024 / 1:05 PM IST

Devineni Avinash : వైసీపీ నేత దేవినేని అవినాశ్ కు మంగళగిరి పోలీసులు షాకిచ్చారు. విదేశాలకు వెళ్ళేందుకు అవినాశ్ వేసిన ప్లాన్ ను పోలీసులు పటాపంచలు చేశారు. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు అవినాశ్ యత్నించారు. శంషాబాద్ విమానాశ్రయం అధికారులు మంగళగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అవినాశ్ పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు విమానాశ్రయం అధికారులకు సూచించారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయం అధికారులు అవినాశ్ ను అడ్డుకున్నారు. అవినాశ్ విమానాశ్రయం నుంచి వెనక్కి వెళ్లిపోయారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాశ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. దాడిలో పాల్గొన్న వారిపై పోలీసులు ముందస్తు చచ్యలు చేపట్టి.. లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

Also Read : Nara Lokesh : అన్న క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్ .. స్వయంగా అల్పాహారం వడ్డించిన మంత్రి

2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి కొందరు పాల్పడిన విషయం తెలిసిందే. కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సిబ్బందిపైనా దాడి చేశారు. అప్పట్లో ఈ ఘటన తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశవ్యాప్తంగా సంచలనంగా రేపింది. దాడి ఘటనపై పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఘటనపై విచారణ ప్రారంభించారు. ఈ కేసులో దేవినేని అవినాశ్ పై కూడా ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే.