Botsa Satyanarayana: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం

రాబోయే కాలంలో జిల్లా అభివృద్ధే ద్యేయంగా, ఒకే మాటతో, ఒకే విధానంతో పనిచేస్తామని చెప్పారు.

Botsa Satyanarayana: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం

Botsa Satyanarayana Elected as Visakha MLC Polls

Updated On : August 16, 2024 / 5:04 PM IST

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బొత్సకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు రిటర్నింగ్ అధికారి.

ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వరలక్ష్మీ ఆశీసులతో రాష్ట్ర ప్రజలు శుభంగా ఉండాలని శ్రావణ శుక్రవారం రోజున కోరుకుంటున్నానని అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు జేసీ సర్టిఫికెట్ అందజేశారని తెలిపారు. తనకు బీ ఫామ్ ఇచ్చి పోటీకి దింపిన జగన్ కు,తమ నాయకులందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.

రాబోయే కాలంలో జిల్లా అభివృద్ధే ద్యేయంగా, ఒకే మాటతో, ఒకే విధానంతో పనిచేస్తామని చెప్పారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీలోని కూటమి పోటీ చేయలేదన్న విషయం తెలిసిందే. నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి షఫీ దాన్ని ఉపసంహరించుకున్నారు.

మొదట ఈ ఎన్నికలో పోటీ చేయాలని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భావించింది. ఎన్నిక బరిలో ఓ పారిశ్రామికవేత్తను కూడా నిలుపుతారని ప్రచారం జరిగింది. చివరకు ఈ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు టీడీపీ ప్రకటించింది.

Also Read: జమ్మూకశ్మీర్‌, హరియాణా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల