Air Hostess in India : భారత్‌లో ఎయిర్ హోస్టెస్ నెలకు ఎంత సంపాదిస్తారో తెలుసా? ఏయే అర్హతలు ఉండాలంటే?

Air Hostess in India : ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం పొందాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? ఏయే భాషలు వచ్చి ఉండాలి అనే విషయాలు తెలియకపోవచ్చు.

Air Hostess in India : భారత్‌లో ఎయిర్ హోస్టెస్ నెలకు ఎంత సంపాదిస్తారో తెలుసా? ఏయే అర్హతలు ఉండాలంటే?

What is the salary of Air Hostess in India per month ( Image Source : Google )

Air Hostess in India : విమానాల్లో ప్రయాణికులకు ఎయిర్ హోస్టెస్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తరచూ విమానాల్లో ప్రయాణించే సమయాల్లో వారితో ఏదో ఒక విషయంలో కమ్యూనికేట్ అవుతూనే ఉంటారు. అయితే, ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం గురించి చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు.

Read Also : Zomato Delivery Boy : ఉండేది ముంబై మురికివాడలో.. నెలకు అద్దె రూ. 500.. జొమాటో డెలివరీ బాయ్ రియల్ లైఫ్ స్టోరీ..!

యువతులకు మాత్రమే ఎయిర్ హోస్టెస్ ప్రత్యేక అవకాశాలు ఉన్నాయి. అసలు ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం పొందాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? ఏయే భాషలు వచ్చి ఉండాలి అనే విషయాలు తెలియకపోవచ్చు. సాధారణంగా ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం పొందాలంటే ముందుగా వారికి మాతృభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలు అనర్గళంగా మాట్లాడగలగాలి. విదేశీ భాషలు కూడా తప్పక తెలిసి ఉండాలి.

ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి విద్యార్హతలతో పాటు విదేశీ భాషలను తప్పక నేర్చుకోవడం తప్పనిసరి. అప్పుడు మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయని చెప్పవచ్చు. ఎయిర్ హోస్టెస్ ఉద్యోగంలో మంచి జీతమే కాదు.. విదేశాలకు కూడా తరచూ వెళ్లి రావొచ్చు. ఈ ఎయిర్ హోస్టెస్ కోసం ప్రత్యేక శిక్షణ కూడా పొందాలి.

దీనికి సంబంధించి ఏవియేషన్ నిపుణుడు ఒకరు ఎయిర్ హోస్టెస్ అయ్యేందుకు అవసరమైన విద్యార్హతలను వివరించారు. ఎయిర్ హోస్టెస్ కోసం ముందుగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఎయిర్ హోస్టెస్ జాబ్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. 12వ తరగతిలో కనీసం 55 శాతం మార్కులు కలిగి ఉండాలి.

ఎయిర్ హోస్టెస్ అయ్యే యువతుల్లో విద్య మాత్రమే కాదు.. శారీరక ఎత్తు, బరువు చాలా ముఖ్యం. మహిళ ఎత్తు 5.5 అడుగులు ఉండాలి. ఎత్తుకు తగిన బరువు 55 కిలోల నుంచి 60 కిలోల మధ్య ఉండాలని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు. ఎయిర్ హోస్టెస్ కోసం దరఖాస్తు చేసే యువతులు ఆహారపు అలవాట్లు, జీవనశైలి, డ్రెస్సింగ్ విధానంలో జాగ్రత్తలు తీసుకోవాలంట.

ఎయిర్ హోస్టెస్ కోసం ఇంటర్ తర్వాత ఏదైనా కంపెనీలోనైనా రెండేళ్ల ఎయిర్ హోస్టెస్ కోర్సు చేయొచ్చు. సంబంధిత డేటా ప్రకారం.. భారత్‌లో ఎయిర్ హోస్టెస్ వేతనం నెలకు రూ. 40,671 నుంచి రూ. 2,09,273 మధ్య ఉంటుందని అంచనా. దీనిపై అధికారిక డేటా అందుబాటులో లేదు. ఇంటర్నెట్‌లో డేటా ఆధారంగా కేవలం అంచనా మాత్రమే..

Read Also : Zomato Instant Balance : జొమాటో ఇన్‌స్టంట్ బ్యాలెన్స్ ఫీచర్‌.. ఇదేంటి? కస్టమర్లకు బెనిఫిట్స్ ఏంటి?