మనీశ్ సిసోడియా మళ్లీ ఢిల్లీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారా..? ఆయన ఏమన్నారంటే
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా మళ్లీ బాధ్యతలు స్వీకరించే విషయంపై ఆప్ నేత మనీశ్ సిసోడియా స్పందించారు.

Manish Sisodia
Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు ఇటీవల సుప్రీంకోర్టు నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో 17నెలలు తరువాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. జైల్లో నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. త్వరలో ఆయన పాదయాత్ర చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో.. తాజాగా ఓ జాతీయ ఛానల్ ఇంటర్వ్యూలో మనీశ్ సిసోడియా పలు విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read : విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా టీడీపీ.. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంలో మనీశ్ సిసోడియా ఉపముఖ్యమంత్రిగా కొనసాగారు. లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన తరువాత ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రిగా మళ్లీ బాధ్యతలు చేపడతారా అనే ప్రశ్నకు సిసోడియా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఆప్ ప్రభుత్వంలో మళ్లీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడం సాధ్యమే. కానీ, ఈ విషయంలో నేను తొందరపడను. జైలు నుంచి బయటకు రాగానే ప్రభుత్వంలో చేరేందుకు తొందరపడటం లేదు. నన్ను కలవడానికి వస్తున్న కార్యకర్తలకు సమయం ఇచ్చి వారితో మాట్లాడాలని అనుకుంటున్నాను. అదేవిధంగా అసెంబ్లీకి వెళ్లాలని నేను తొందరపడుతున్నానని చెప్పారు.
Also Read : Manish sisodia : బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మనీశ్ సిసోడియా.. ప్రజలకు కీలక విజ్ఞప్తి
ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టే విషయంలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని మనీశ్ సిసోడియా అన్నారు. ఇప్పుడేం తొందరలేదు. కేజ్రీవాల్ బయటకు వచ్చిన తరువాత ప్రభుత్వంలో చేరి పనిచేయాలా.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలా అనేది పార్టా నాయకత్వం నిర్ణయిస్తుందని సిసోడియా చెప్పారు.