విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా టీడీపీ.. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలో నిలపకూడదని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా టీడీపీ.. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

YS Jagan mohan Reddy

Updated On : August 14, 2024 / 3:17 PM IST

YS Jaganh Mohan Reddy : విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని బరిలో నిలపకూడదని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. దీంతో ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గెలుపు ఖాయమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని బరిలో నిలపకపోవడంతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. బుధవారం యలమంచిలి, భీమిలి నియోజకవర్గాల వైసీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీలతో వైఎస్ జగన్ వేరువేరుగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు నాయుడు సహజనైజం ఇది కాదు. ఫోన్లు చేసి అది ఇస్తా.. ఇది ఇస్తా అంటూ ప్రలోబాలాకు గురిచేస్తాడు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందిరికీ కాల్స్ చేసి అది ఇస్తా.. ఇది ఇస్తా అని ఆశ చూపట్టే ఉంటాడు. కానీ, ధర్మం, న్యాయం గెలిచింది. మీరంతా ఒక్కటిగా నిలబడ్డారు కాబట్టి చంద్రబాబు మెడలు వంచక తప్పలేదని స్థానిక సంస్థల వైసీపీ ప్రజాప్రతినిధులను జగన్ అభినందించారు. సంఖ్యాబలం లేనప్పుడు టీడీపీ అభ్యర్థిని పోటీలోకి దింపుతామని చంద్రబాబు అనడమే తప్పు. కానీ, మీరంతా ఒక్కటిగా ఉండటం వల్లనే విజయం సాధ్యమైందని జగన్ పేర్కొన్నారు.

Also Read : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

విద్యా, ఉద్యోగ, వ్యవసాయ రంగాలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని వైఎస్ జగన్ విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం చదవులను పక్కనపెట్టేశారని, ఆరోగ్యశ్రీ బకాయిలకు రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను ఫణంగా పెట్టి రెడ్ బుక్ పాలన సాగిస్తోందన్నారు. అక్కచెల్లెమ్మల రక్షణ కోసం తెచ్చిన దిశ యాప్ ఎక్కడుందో తెలియడం లేదన్నారు.