Redmi A3x Launch : రెడ్‌మి నుంచి కొత్త ఫోన్ ఇదిగో.. భారీ బ్యాటరీతో రెడ్‌మి A3ఎక్స్ ఫోన్, ధర, ఫీచర్లు ఇవే

Redmi A3x Launch : ఈ స్మార్ట్‌ఫోన్ భారతీయ వెర్షన్ గ్లోబల్ కౌంటర్‌పార్ట్‌లను పోలి ఉంటుంది. వృత్తాకార కెమెరా డెకో డిజైన్, పారదర్శక మిర్రర్ షీన్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్ కలిగి ఉంది.

Redmi A3x Launch : రెడ్‌మి నుంచి కొత్త ఫోన్ ఇదిగో.. భారీ బ్యాటరీతో రెడ్‌మి A3ఎక్స్ ఫోన్, ధర, ఫీచర్లు ఇవే

Redmi A3x With 6.71-Inch HD Plus LCD Screen ( Image Source : Google )

Redmi A3x Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? రెడ్‌‌మి ఎ3ఎక్స్ మొదట ఈ ఏడాది మేలో పాకిస్తాన్‌లో లాంచ్ అయింది. గత జూన్‌లో కంపెనీ గ్లోబల్ వెబ్‌సైట్‌లో లిస్టు అయింది. కొన్ని వారాల క్రితం ఈ హ్యాండ్‌సెట్ అమెజాన్ ఇండియాలో కనిపించింది. ఇప్పుడు, ఫోన్ షావోమీ ఇండియా వెబ్‌సైట్‌లో జాబితా అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ భారతీయ వెర్షన్ గ్లోబల్ కౌంటర్‌పార్ట్‌లను పోలి ఉంటుంది. వృత్తాకార కెమెరా డెకో డిజైన్, పారదర్శక మిర్రర్ షీన్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్ కలిగి ఉంది. రెడ్‌మి ఎ3ఎఎక్స్ యూనిసోక్ టీ603 ప్రాసెసర్‌తో ఆధారితమైనది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

Read Also : Mark Zuckerberg : మెటా సీఈఓ మరుపురాని గిఫ్ట్.. పెరట్లో ఏకంగా భార్య ప్రిస్సిల్లా శిల్పం.. ప్రేమంటే ఇదేగా..!

భారత్‌లో రెడ్‌మి ఎ3ఎక్స్ ధర ఎంతంటే? :
దేశ మార్కెట్లో రెడ్‌మి ఎ3ఎక్స్ 3జీబీ+ 64జీబీ ఆప్షన్ ప్రారంభ ధర రూ. 6,999, అయితే 4జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ. 7,999కు పొందవచ్చు. ఈ ఫోన్ దేశంలో అమెజాన్, షావోమీ ఇండియా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ గ్రీన్, ఆలివ్ గ్రీన్, స్టార్రీ వైట్ అనే నాలుగు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

రెడ్‌మి ఎ3ఎక్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
రెడ్‌మి ఎ3ఎక్స్ 6.71-అంగుళాల హెచ్‌డీ+ (720 x 1,650 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ డాట్ డ్రాప్ స్క్రీన్‌తో గరిష్టంగా 90Hz రిఫ్రెష్ రేట్, 500నిట్స్ బ్రైట్‌నెస్ లెవల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. జాబితా ప్రకారం.. రెడ్‌మి ఫోన్ 4జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ యూనిసోక్ టీ603 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. వర్చువల్‌గా 8జీబీ వరకు పొడిగించవచ్చు.

ఈ రెడ్‌మి ఫోన్ 128జీబీ వరకు ఇఎమ్ఎమ్‌సీ 5.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌కు సపోర్టు ఇస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు విస్తరించవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్14-ఆధారిత హైపర్ఓఎస్‌తో వస్తుంది. రెండు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, మూడు ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. రెడ్‌మి ఎ3ఎక్స్ 8ఎంపీ ప్రైమరీ సెన్సార్‌ను కలిగిన డ్యూయల్ బ్యాక్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. అయితే, ఫ్రంట్ సైడ్ 5ఎంపీ సెన్సార్ ఉంది. రెడ్‌మి ఎ3ఎక్స్ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా 10డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది.

ఈ రెడ్‌మి ఫోన్ 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్‌తో పాటు 4జీ ఎల్‌టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్ కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. సెక్యూరిటీ విషయానికి సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఏఐ ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ సైజులో 168.4 x 76.3 x 8.3 మిమీ ఉంటుంది. 

Read Also : Oppo F27 5G Price : ఒప్పో నుంచి సరికొత్త 5జీ ఫోన్.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?