విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి గొట్టిపాటి కీలక ఆదేశాలు

మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం మా ప్రభుత్వ విధానం కాదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.

విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి గొట్టిపాటి కీలక ఆదేశాలు

Gottipati Ravi Kumar (Photo Credit : Google)

Updated On : August 17, 2024 / 7:48 PM IST

Minister Gottipati Ravi Kumar : విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వర్చువల్ గా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ షాక్ తో చనిపోయిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాణ నష్టాన్ని తగ్గించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధిక ప్రాణనష్టం ఏ విధంగా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు మంత్రి గొట్టిపాటి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాడుతున్న విద్యుత్ వైర్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

విద్యుత్ లైన్ల మరమత్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో చెప్పారు. వచ్చే సమీక్ష నాటికి సంబంధిత సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం మా ప్రభుత్వ విధానం కాదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. విద్యుత్ శాఖతో నష్టపోయిన ప్రతీ కుటుంబానికి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలిచ్చారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.

Also Read : ఏపీలో వరుస కేసులు.. ఒకరి తర్వాత ఒకరు.. నెక్ట్స్‌ లిస్ట్‌లో వచ్చే పేరు ఎవరిదో?