WI vs SA : చ‌రిత్ర సృష్టించిన ద‌క్షిణాఫ్రికా స్పిన్న‌ర్ కేశ‌వ్ మ‌హరాజ్‌

ద‌క్షిణాఫ్రికా స్పిన్న‌ర్ కేశ‌వ్ మ‌హరాజ్‌ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

WI vs SA : చ‌రిత్ర సృష్టించిన ద‌క్షిణాఫ్రికా స్పిన్న‌ర్ కేశ‌వ్ మ‌హరాజ్‌

Keshav Maharaj creates history becomes South Africa leading wicket taking spinner

West Indies vs South Africa : ద‌క్షిణాఫ్రికా స్పిన్న‌ర్ కేశ‌వ్ మ‌హరాజ్‌ అరుదైన ఘ‌న‌త సాధించాడు. వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచులో అత‌డు దీన్ని అందుకున్నాడు. ద‌క్షిణాఫ్రికా త‌రుపున టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన స్పిన్న‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. రెండో టెస్టు మ్యాచ్‌లో అత‌డు 5 వికెట్లు ప‌డ‌గొట్ట‌డంతో అత‌డు దీన్ని అందుకున్నాడు. ఇంత‌క‌ముందు వ‌ర‌కు ఈ రికార్డు హ్యూ టేఫీల్డ్ పేరిట ఉండేది. అత‌డు 170 వికెట్లు తీయ‌గా.. మ‌హారాజ్ 52 టెస్టుల్లోనే 171 వికెట్ల ప‌డ‌గొట్టాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలి ఇన్నింగ్స్‌ల్లో ద‌క్షిణాఫ్రికా 160 ప‌రుగులు చేసింది. అనంత‌రం వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌ల్లో 144 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో ద‌క్షిణాఫ్రికాకు 16 ప‌రుగుల స్వ‌ల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. ఆ త‌రువాత రెండో ఇన్నింగ్స్‌ల్లో స‌ఫారీ జ‌ట్టు 246 ప‌రుగులు చేసింది.

ICC Rankings : 8 నెల‌లుగా వ‌న్డే ఆడ‌ని బాబ‌ర్‌.. అయినా అగ్ర‌స్థానంలోనే? పాక్ మాజీ ఆట‌గాడి మండిపాటు

దీంతో విండీస్ ముందు 263 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది. భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన విండీస్ జ‌ట్టు 222 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో ద‌క్షిణాప్రికా 40 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలో రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ను 0-1తో కైవ‌సం సౌతాఫ్రికా కైవ‌సం చేసుకుంది. తొలి టెస్టు డ్రా గా ముగిసిన సంగ‌తి తెలిసిందే.