Balineni Srinivasa Reddy : ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 12 పోలింగ్ బూత్‌ల‌కు నేడు మాక్ పోలింగ్..

ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని 12 పోలింగ్ బూత్‌ల‌లోని 12ఈవీఎంలకు మాక్ పోలింగ్ (రీ వెరిఫికేషన్) ప్రక్రియ జరగనుంది.

Balineni Srinivasa Reddy : ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 12 పోలింగ్ బూత్‌ల‌కు నేడు మాక్ పోలింగ్..

Mock polling

Mock Polling In EVMs : ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని 12 పోలింగ్ బూత్‌ల‌లోని 12ఈవీఎంలకు మాక్ పోలింగ్ (రీ వెరిఫికేషన్) ప్రక్రియ జరగనుంది. ఇవాళ ఉదయం 10గంటలకు ఒంగోలు లోని భాగ్యనగర్ లో ఉన్న ఈవీఎంల గోదాములో మాక్ పోలింగ్ ను బెల్ సంస్థ ప్రతినిధులు నిర్వహించనున్నారు. ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల ఈవీఎంల తీరుపై తనకు అనుమానాలు ఉన్నాయంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి మాజీమంత్రి, ఒంగోలు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రీ మాక్ పోలింగ్ నిర్వహించాలంటూ సీఈసీకి బాలినేని విజ్ఞప్తి చేశారు. బాలినేని విన్నపానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఇందుకోసం అయ్యే ఫీజును ఇప్పటికే బాలినేని కేంద్ర ఎన్నికల సంఘానికి చెల్లించారు.

Also Read : టీడీపీ సీనియర్లు, నాగబాబుకు కీలక పదవులు..! నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం..

బాలినేని ఈవీఎంలపై వ్యక్తం చేసిన అనుమానాలను నివృత్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ తమీమ్ ఆన్సారియా సిద్దమవుతున్నారు. రీ మాక్ పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రీ మాక్ పోలింగ్ నిర్వహన తీరుపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ హైదరాబాద్ లో ట్రైనింగ్ పొందారు. ఇప్పటికే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన 26మంది అభ్యర్థులకు కలెక్టర్ తమీమ్ ఆన్సారియా సమాచారం అందించారు. రోజుకు మూడు ఈవీఎంల చొప్పున నాలుగు రోజులపాటు రీ మాక్ పోలింగ్ ప్రక్రియను జరగనుంది. ఈ ప్రక్రియను భూసేకరణ విభాగపు ప్రత్యేక కలెక్టర్ ఝాన్సీలక్ష్మీ పర్యవేక్షించనున్నారు. మరోవైపు ఈ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరా నిఘాలో చేపట్టనున్నారు.