అందుకే ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 12 పోలింగ్ బూత్‌ల‌కు రీ వేరిఫికేషన్ ఆగిపోయింది: వైసీపీ లీగల్ అడ్వైజర్

ఎన్నికల సంఘం నిభందనల మేరకు ఆరోజు పోలింగ్ కు వాడిన 12 పోలింగ్ బూత్‌లకు చెందిన ఈవీఎంలలో నిర్లిప్తమై ఉన్న ఓటింగ్ డేటాను..

అందుకే ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 12 పోలింగ్ బూత్‌ల‌కు రీ వేరిఫికేషన్ ఆగిపోయింది: వైసీపీ లీగల్ అడ్వైజర్

ప్రకాశం జిల్లా, ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని 12 పోలింగ్ బూత్‌లకు మాక్ పోలింగ్, రీ చెకింగ్‌పై వైసీపీ లీగల్ అడ్వైజర్ లోకేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాము రీ వెరిఫికేషన్ కోరలేదని, పోలింగ్ రోజు జరిగిన ఓట్లలో సుప్రీంకోర్టు గైడ్ లెన్స్ ప్రకారం రీ కౌంటింగ్ జరపాలని కోరామని తెలిపారు.

అందుకు కలెక్టర్ అంగీకరించక పోవడంతో రీ వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచి పోయిందని తెలిపారు. 2024 మే13న జరిగిన ఎన్నికల్లో తాము అనుమాలు వ్యక్తం చేసిన 12 పోలింగ్ బూత్‌లలోని ఈవీఎం, పోస్టుబ్యాలెట్లను, వీవీ ప్యాడ్లను రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశామని చెప్పారు.

ఎన్నికల సంఘం నిభందనల మేరకు ఆరోజు పోలింగ్ కు వాడిన 12 పోలింగ్ బూత్‌లకు చెందిన ఈవీఎంలలో నిర్లిప్తమై ఉన్న ఓటింగ్ డేటాను పూర్తిగా తొలగించి రీ వెరిఫికేషన్ నిర్వహిస్తామన్నారని తెలిపారు. ఆ ప్రతిపాదనను తాము రిజెక్ట్ చేశామని, సుప్రీంకోర్టు నిబంధనల మేరకు.. ఎన్నికలు జరిగిన నియోజకవర్గంలోని 5 శాతం ఓట్లను రీకౌంటింగ్ నిర్వహించవలసి ఉందని చెప్పారు.

కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ లెన్స్ ను అమలు చేయాలని తాము జిల్లా కలెక్టర్ కు విన్నవించామని తెలిపారు. దీంతో ఈరోజు రీవెరిఫికేషన్ ఆగిపోయిందని చెప్పారు. బాలినేని ప్రతినిధులుగా జిల్లా కలెక్టర్ ప్రతిపాదించిన రీ వేరిఫికేషన్ ను తాము రిజెక్ట్ చేస్తూ కలెక్టర్ కు లేఖను సమర్పించామని తెలిపారు. ఆ లేఖను ఎన్నికల సంఘానికి పంపి తదుపరి ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం సమాచారం అందిస్తానని జిల్లా కలెక్టర్ తమీమ్ ఆన్సారియా తెలిపారని చెప్పారు.

Also Read : రాఖీ వేళ.. కవితపై కేటీఆర్ భావోద్వేగ ట్వీట్..